Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 13 Aug 2023 21:01 IST

1. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షల కొత్త తేదీలివే..

గ్రూప్‌-2 పరీక్షల (TSPSC Group 2 Exams) రీషెడ్యూల్‌ తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్‌ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెలలోనే గ్రూప్‌ 2 పరీక్షలు జరగాల్సి ఉన్నప్పటికీ అభ్యర్థుల ఆందోళనలతో ప్రభుత్వం వీటిని నవంబరు మాసానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రుషికొండపై దేవుడు ఉండాలి.. నేరగాళ్లు కాదు: పవన్‌

రుషికొండపై దేవుడు ఉండాలి.. నేరగాళ్లు కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వారాహి యాత్రలో భాగంగా గాజువాకలో ఆయన మాట్లాడారు. 2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా జగన్‌ను మరో 6 నెలలు భరించాలన్నారు. తనకు అండగా ఉంటే విశాఖను ఐటీ కేంద్రంగా మారుస్తానని హామీ ఇచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హైదరాబాద్‌లో ఎకరం రూ.100 కోట్లకు కులం పెంచిందా?: లోకేశ్‌

దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్‌ మూడు ముక్కలాట ఆడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దుయ్యబట్టారు. రావెలలో ‘అమరావతి ఆక్రందన’ పేరుతో రాజధాని రైతులతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమానికి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పంద్రాగస్టు వేళ.. బస్సు టికెట్లపై భారీ రాయితీలు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక రాయితీలు ప్రకటించింది.  రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ నగరంలోని సాధారణ ప్రయాణికులకు టికెట్‌లో భారీ రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. హకీంపేట క్రీడా పాఠశాలలో ముగిసిన విచారణ

హకీంపేట క్రీడా పాఠశాల లైంగిక ఆరోపణల వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ ముగిసింది. ఓఎస్డీ హరికృష్ణ, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల కోచ్‌లు, సిబ్బందిని కమిటీ ఏడు గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. విద్యార్థుల నుంచి రాత పూర్వకంగా స్టేట్‌మెంట్‌ తీసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ట్యాంక్ బండ్‌పై గద్దర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: వైఎస్‌ షర్మిల

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించి ఓదార్చారు. గద్దర్ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం తెలంగాణ కళా రంగానికి తీరని లోటని అన్నారు. గద్దర్ సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సైరన్‌ స్థానంలో భారతీయ సంగీతం.. త్వరలో కొత్త పాలసీ: గడ్కరీ

మంత్రులు, వీఐపీల కార్లకు ప్రోటోకాల్‌లో భాగంగా సైరన్‌ ఉంటుంది. రోడ్లపై సైరన్‌ మోతతో వాహనాలు వెళుతుంటే.. అందులో ఎవరో వీఐపీ వెళుతున్నారని, పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్ చేస్తారు. కానీ, ఈ సైరన్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. వీఐపీలు వాహనాల్లో లేకపోయినా.. ట్రాఫిక్‌ కష్టాల నుంచి తప్పించుకునేందుకు సైరన్‌ మోగిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విమానంలో భయానక అనుభవం..!

అమెరికా (America)లో ఓ విమానంలో ప్రయాణించినవారికి ఊహించని అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం (American Airlines) కేవలం మూడు నిమిషాల వ్యవధిలో ఏకంగా 15 వేల అడుగులు కిందికి దిగడం కలవరం రేపింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు.. చివరకు విమానం క్షేమంగా ల్యాండింగ్‌ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నియంతృత్వ పాలన సాగించడానికే కొత్త చట్టాల రూపకల్పన : కపిల్ సిబల్‌

దేశంలో నియంతృత్వ పాలన సాగించడానికే కేంద్ర ప్రభుత్వం నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమైందని మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్‌ (Kapil Sibal) విమర్శించారు. కొత్త బిల్లు ‘భారతీయ న్యాయ సంహిత’  (Bharatiya Nyaya Sanhita) రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మణిపుర్‌ అల్లర్లు.. సీబీఐ చేతికి మరో 9 కేసులు!

మణిపుర్‌ (Manipur) విధ్వంసానికి సంబంధించి మరో 9 కేసులను సీబీఐ (CBI) దర్యాప్తు చేయనుంది. దాంతో ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తున్న కేసుల సంఖ్య 17కు చేరుకోనుంది. అయితే.. సీబీఐ విచారణ కేవలం 17 కేసులకే పరిమితం కాబోదని ఉన్నతాధికారులు వెల్లడించారు. మహిళలపై నేరాలు, లైంగిక దాడులకు సంబంధించిన ఎలాంటి కేసులు వెలుగులోకి వచ్చినా సీబీఐ వాటిని పరిగణలోకి తీసుకొని వేగంగా దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని