Manipur : మణిపుర్‌ అల్లర్లు.. సీబీఐ చేతికి మరో 9 కేసులు!

మణిపుర్‌లో (Manipur) హింసకు సంబంధించిన పలు కేసులను సీబీఐ (CBI) విచారిస్తోంది. తాజాగా మరో 9 కేసులను ఆ సంస్థ దర్యాప్తు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

Published : 13 Aug 2023 17:20 IST

ఇంఫాల్‌ : మణిపుర్‌ (Manipur) విధ్వంసానికి సంబంధించి మరో 9 కేసులను సీబీఐ (CBI) దర్యాప్తు చేయనుంది. దాంతో ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తున్న కేసుల సంఖ్య 17కు చేరుకోనుంది. అయితే.. సీబీఐ విచారణ కేవలం 17 కేసులకే పరిమితం కాబోదని ఉన్నతాధికారులు వెల్లడించారు. మహిళలపై నేరాలు, లైంగిక దాడులకు సంబంధించిన ఎలాంటి కేసులు వెలుగులోకి వచ్చినా సీబీఐ వాటిని పరిగణలోకి తీసుకొని వేగంగా దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు. ఘర్షణలు మొదలైన తొలినాళ్లలో ఇద్దరు మహిళలను నగ్నంగా తిప్పిన కేసు సహా ఎనిమిది కేసులు ప్రస్తుతానికి సీబీఐ చేతిలో ఉన్నాయి. చురాచంద్‌పుర్‌ జిల్లాలో చోటు చేసుకున్న మరో లైంగిక వేధింపుల కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడిపై కాల్పులు.. వెన్నులో దిగిన బుల్లెట్‌

రాష్ట్రంలోని రెండు జాతుల మధ్య ఘర్షణల నేపథ్యంలో..  అధికారులపై సైతం వర్గ ముద్ర పడుతోంది. దాంతో ఎలాంటి పక్షపాత ఆరోపణలకు తావు లేకుండా మణిపుర్‌లో తమ కార్యకలాపాలు కొనసాగించడం సీబీఐకి పెను సవాలుగా మారింది. అందుకే మణిపుర్‌ రాష్ట్ర అధికారుల ఎంపికలో సీబీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది. సీబీఐ విచారిస్తున్న చాలా కేసులు షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల (అత్యాచారాల నిరోధక) చట్టానికి సంబంధినవి ఉన్నాయి. వీటిని డీఎస్పీ స్థాయి ర్యాంక్‌ అధికారి విచారిస్తారు. అలా కుదరనీ పక్షంలో సీబీఐ ఎస్పీలు ఈ కేసులను పర్యవేక్షించే అవకాశం ఉంది. వివిధ కేసుల్లో సీబీఐ సేకరిస్తున్న అన్ని రకాల ఫోర్సెనిక్‌ శాంపిళ్లను సెంట్రల్‌ ఫోర్సెనిక్‌ సైన్స్‌ ల్యాబోరేటరీకి పంపిస్తోంది. మహిళలపై జరుగుతున్న నేరాలను దర్యాప్తు చేయడానికి సీబీఐ మహిళా అధికారులను నియమించింది. బాధితుల స్టేట్‌మెంట్‌ నమోదు చేయడం, అనుమానితులను ప్రశ్నించడం తదితర విషయాల్లో వారి సేవలను వినియోగించుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు