Plane Drop: విమానంలో భయానక అనుభవం..! 3 నిమిషాల్లోనే 15 వేల అడుగులు కిందికి

అమెరికాలో ఓ విమానం కేవలం మూడు నిమిషాల్లోనే ఏకంగా 15 వేల అడుగులు కిందికి దిగింది. విమానంలో పీడన సమస్యతో ఇలా జరిగినట్లు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది.

Published : 13 Aug 2023 17:44 IST

వాషింగ్టన్‌: అమెరికా (America)లో ఓ విమానంలో ప్రయాణించినవారికి ఊహించని అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం (American Airlines) కేవలం మూడు నిమిషాల వ్యవధిలో ఏకంగా 15 వేల అడుగులు కిందికి దిగడం కలవరం రేపింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు.. చివరకు విమానం క్షేమంగా ల్యాండింగ్‌ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో పీడనానికి (Pressurisation) సంబంధించిన సమస్య తలెత్తడమే దీనికి కారణమని విమానయాన సంస్థ తెలిపింది.

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఇటీవల ఉత్తర కరోలినాలోని షార్లెట్‌ నుంచి ఫ్లోరిడాలోని గెయిన్జ్‌విల్‌కు బయల్దేరింది. అయితే, మార్గమధ్యలో 29 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో పీడన సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే మాస్కుల ద్వారా ప్రయాణికులకు ఆక్సిజన్‌ సౌకర్యం అందజేశారు. ఈ క్రమంలోనే విమానాన్ని వీలైనంత త్వరగా కిందికి దించి, తక్కువ ఎత్తులో నడపాలని నిర్ణయించిన పైలట్లు.. ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ విమానం కేవలం ఆరు నిమిషాల్లోపే 18,600 అడుగుల కిందికి దిగిపోయినట్లు ‘ఫ్లైట్‌అవేర్‌’ వెబ్‌సైట్‌ పేర్కొంది.

గత 100 ఏళ్లలో చూడని ఘోరం.. అమెరికా ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌

విమానంలో ప్రయాణించిన, ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ హరిసన్‌ హోవ్‌ తన అనుభవాన్ని ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ‘నేను చాలాసార్లు విమానంలో ప్రయాణించాను. కానీ, ఇది భయానక అనుభవం’ అని పేర్కొన్నారు. అయితే, విమానంలో పీడనానికి సంబంధించిన సమస్యతోనే కిందికి దించినట్లు విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని