Hakimpet: క్రీడా పాఠశాలలో లైంగిక ఆరోపణలు.. ముగిసిన కమిటీ ప్రాథమిక విచారణ

హకీంపేట క్రీడా పాఠశాల లైంగిక ఆరోపణల వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ ముగిసింది.

Updated : 13 Aug 2023 20:38 IST

హైదరాబాద్‌: హకీంపేట క్రీడా పాఠశాల లైంగిక ఆరోపణల వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ ముగిసింది. ఓఎస్డీ హరికృష్ణ, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల కోచ్‌లు, సిబ్బందిని కమిటీ ఏడు గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. విద్యార్థుల నుంచి రాత పూర్వకంగా స్టేట్‌మెంట్‌ తీసుకుంది. ప్రాథమికంగా విచారణ ముగిసినట్లు బాలల పరిరక్షణ కమిషన్ మెంబర్ రాగ జ్యోతి తెలిపారు. సున్నితమైన అంశం కాబట్టి మీడియా సహకరించాలని ఆమె కోరారు. విచారణ పూర్తి చేసేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.

మేడ్చల్ జిల్లాలోని హకీంపేట క్రీడా పాఠశాల బాలికలపై అక్కడి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీ హరికృష్ణను విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా వదలబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. అయితే, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను ఓఎస్డీ హరికృష్ణ ఖండించారు. పాఠశాల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు. తానూ ఏ తప్పు చేయలేదని.. పూర్తి వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని