Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Sep 2023 21:15 IST

1. ఏపీలో పరిశ్రమలకు విద్యుత్‌ పరిమితులు ఎత్తివేత

రాష్ట్రంలో మారిన వాతావరణం, ప్రస్తుతం నెలకొన్న అల్పపీడన పరిస్థితులతో విద్యుత్తు వినియోగం తగ్గినందున పరిశ్రమలకు విధించాలని నిర్ణయించిన పరిమితులను ఎత్తివేస్తున్నట్లు ఏపీ ట్రాన్స్‌కో (AP Transco) సీఎండీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె. విజయానంద్‌ (K Vijayanand) ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల  దృష్ట్యా గ్రిడ్‌ డిమాండ్‌ కొంత మేర తగ్గిందని, గత రెండు రోజులుగా ఎలాంటి విద్యుత్‌ కొరత లేదన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాజధాని రైతులకు కౌలు ఎప్పుడు ఇస్తారు?: హైకోర్టు

కౌలు చెల్లింపుపై రాజధాని రైతులు హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. ఈ ఏడాది మేలోనే రైతులకు కౌలు చెల్లించాల్సి ఉండగా, నేటి వరకూ ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కౌలు మినహా, వేరే ఆధారం లేకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టుకు వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిది: కేసీఆర్‌

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ (Sarvepalli Radhakrishnan) జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పెంపొందించి, లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహన కలిగించి, కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రేమోన్మాది దాడి ఘటన.. నిలకడగా సంఘవి ఆరోగ్యం

ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన హోమియో వైద్య విద్యార్థిని సంఘవి ఆరోగ్యం.. ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కత్తిగాట్లకు గురైన ఆమెను కుటుంబసభ్యులు తమ ఆస్పత్రిలో చేర్చినట్టు ఏఐజీ ఆస్పత్రి తెలిపింది. తక్షణమే స్పందించి ఏఐజీ అత్యవసర విభాగం, న్యూరో, ఆర్థో సహా వివిధ విభాగాల వైద్యులు బాధితురాలికి చికిత్స అందించినట్లు తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వైకాపా మాజీ నేత దండా నాగేంద్రకు 14 రోజుల రిమాండ్‌

పల్నాడు జిల్లా అమరావతికి (Amaravati) చెందిన వైకాపా మాజీ నేత దండా నాగేంద్రను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కోర్టు వద్ద నాగేంద్రను మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 16 మందితో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ.. ఉత్తమ్‌కు చోటు

త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ(Congress party) మరో కీలక కమిటీని ప్రకటించింది. ఇటీవల 84మందితో సీడబ్ల్యూసీ(CWC)ని ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం తాజాగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(Congress Central Election Committee)ని ఏర్పాటు చేసింది.  ఈ కమిటీలో మొత్తం 16 మంది ఉండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి(Uttam kumar Reddy)కి చోటు కల్పించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల సందడి

భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల సందడి నెలకొంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకున్నారు. మొదటి రోజు ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇవాళ మొత్తం 182 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి దరఖాస్తు సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి హరిప్రసాద్‌ గౌడ్‌ సమర్పించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎంపికైనట్లు ప్రచురించండి: ఈసీ

గద్వాల అసెంబ్లీ నియోజవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణ (DK Aruna) ఎన్నికైనట్లుగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈసీ లేఖ రాసింది. హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్‌లో ప్రచురించాలని ఆదేశించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: ఉదయ నిధి స్టాలిన్‌

సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన వేళ తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌ మీడియాతో మరోసారి స్పందించారు. తాను కుల భేదాలు నశించాలని అన్నానని, కేవలం హిందుత్వలోనే కాకుండా అన్ని మతాల్లోనూ ఈ భేదాలు పోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పుతిన్‌- ఎర్డోగాన్‌ల భేటీ.. కొలిక్కిరాని ధాన్యం ఎగుమతుల వివాదం!

నల్ల సముద్రం (Black Sea) మీదుగా ఆహార ధాన్యాల ఎగుమతులకు ఉక్రెయిన్, రష్యాల మధ్య కుదిరిన ‘ధాన్యం ఎగుమతుల ఒప్పందం (Grain Deal)’ జులైలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఎగుమతుల విషయంలో తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు రష్యా పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని