KCR: సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిది: కేసీఆర్‌

ఉపాధ్యాయదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులందరికీ సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Published : 04 Sep 2023 20:15 IST

హైదరాబాద్‌: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ (Sarvepalli Radhakrishnan) జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పెంపొందించి, లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహన కలిగించి, కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, ఉపాధ్యాయుల, విద్యార్థుల సంక్షేమం, అభివృద్ధికి సమర్థమైన కార్యాచరణ అమలు చేస్తో్ందని చెప్పారు. గురుకుల విద్యలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. నాణ్యమైన విద్య అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో ఉందని, గుణాత్మక విద్యనందిస్తూ సత్ఫలితాలను ఇస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చదువులు, క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నారని కితాబిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని