Udhayanidhi Stalin: నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: ఉదయ నిధి స్టాలిన్‌

Udhayanidhi Stalin: తాను కులం నశించాలన్న ఉద్దేశంతో మాట్లాడానని ఉదయ నిధి స్టాలిన్‌ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని చెప్పారు.

Published : 05 Sep 2023 02:09 IST

చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన వేళ తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌ మీడియాతో మరోసారి స్పందించారు. తాను కుల భేదాలు నశించాలని అన్నానని, కేవలం హిందుత్వలోనే కాకుండా అన్ని మతాల్లోనూ ఈ భేదాలు పోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘‘నిన్నటి కార్యక్రమంలో తాను ఏదైతే చెప్పానో.. దాన్నే మళ్లీ చెప్తున్నా. కులం అనేది నశించాలి. అది ఏ మతంలో ఉన్నా..’’ అని స్టాలిన్‌ అన్నారు.

‘‘ఇండియా కూటమిని చూసి భాజపా భయపడుతోంది. దాన్నుంచి దృష్టి మరల్చడానికే ఇవన్నీ చేస్తోంది. ప్రధాని మోదీ పదే పదే ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ అంటూ ఉంటారని, అంటే కాంగ్రెస్‌ను చంపేయమని అర్థమా?’’ అని ఉదయనిధి స్టాలిన్‌ ప్రశ్నించారు. తన వ్యాఖ్యలను భాజపా వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. తనపై ఎలాంటి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. 

మరోవైపు ఉదయ నిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతోంది. ఉదయనిధి వ్యాఖ్యలపై ‘ఇండియా’ కూటమి క్షమాపణ చెప్పాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన ‘స్టాలిన్‌’ కాదు ‘హిట్లర్‌’ అంటూ కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై విమర్శించారు. ఉదయనిధి వ్యాఖ్యలు వ్యక్తిగత విషయమని కాంగ్రెస్ పేర్కొంది. ఎవరి మనోభావాలూ దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హితవుపలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని