AP News: రాజధాని రైతులకు కౌలు ఎప్పుడు ఇస్తారు?: హైకోర్టు

రాజధాని రైతులకు మే నెలలోనే కౌలు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ఇవ్వలేదని రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది మురళీధర్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు.

Published : 04 Sep 2023 18:52 IST

అమరావతి: కౌలు చెల్లింపుపై రాజధాని రైతులు హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. ఈ ఏడాది మేలోనే రైతులకు కౌలు చెల్లించాల్సి ఉండగా, నేటి వరకూ ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కౌలు మినహా, వేరే ఆధారం లేకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టుకు వివరించారు. గతంలో పిటిషన్ వేస్తే కేవలం పిటిషనర్ రైతుకే కౌలు ఇచ్చి, మిగతా రైతులకు ఇవ్వలేదని పేర్కొన్నారు.

దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయవాది మురళీధర్ వాదించారు. సీఆర్‌డీఏ, ప్రభుత్వం తరఫు న్యాయవాదులను కౌలు ఎప్పుడు ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో.. వచ్చే మంగళవారంలోపు ప్రభుత్వం సమాధానాలతో రావాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు