Congress: 16మందితో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ.. ఉత్తమ్‌కు చోటు

Congress: కాంగ్రెస్‌ పార్టీ 16 మందితో కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్‌కు చోటు లభించింది.

Updated : 04 Sep 2023 20:15 IST

'

దిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ(Congress party) మరో కీలక కమిటీని ప్రకటించింది. ఇటీవల 84మందితో సీడబ్ల్యూసీ(CWC)ని ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం తాజాగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(Congress Central Election Committee)ని ఏర్పాటు చేసింది.  ఈ కమిటీలో మొత్తం 16 మంది ఉండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి(Uttam kumar Reddy)కి చోటు కల్పించారు. ఈ కమిటీని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోమవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

16న హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ కీలక భేటీ.. తెలంగాణలోనూ ‘5 గ్యారంటీ’లతో రెడీ!

కమిటీలో సభ్యులు వీళ్లే..

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో ఏర్పాటైన ఈ కీలక కమిటీలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, అంబికా సోనీ, అధిర్‌ రంజన్‌ చౌధురి, సల్మాన్‌ ఖుర్షిద్‌, మధుసూదన్‌ మిస్త్రీ, ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, టీఎస్‌ సింగ్‌ దేవ్‌, కేజే జార్జ్‌, ప్రీతమ్‌ సింగ్‌, మహమ్మద్‌ జావేద్‌, అమీ యజానిక్‌, పీఎల్‌ పునియా, ఓంకార్‌ మార్కమ్‌, కేసీ వేణుగోపాల్‌ సభ్యులుగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని