Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Mar 2024 21:09 IST

1. శ్రీవారి లడ్డూ ధర తగ్గించలేం: ఈవో ధర్మారెడ్డి

క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు యువత ముందుకు రావాలని తితిదే ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో శనివారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు ఈవో సమాధానమిచ్చారు. లడ్డూ ప్రసాదం ధరలు తగ్గించలేమని స్పష్టం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వారణాసి నుంచి మోదీ.. భాజపా తొలి జాబితా విడుదల

సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP) సమర శంఖం పూరించింది. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో భాజపా లోక్‌సభ అభ్యర్థులు వీరే..

లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భాజపా (BJP) విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకుగానూ పోటీదారుల పేర్లు ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 9 మందిని అధిష్ఠానం ఎంపిక చేసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌ స్థానాల్లో గెలుపొందగా.. అందులో ముగ్గురు సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం కల్పించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హూ కిల్డ్‌ బాబాయ్‌.. జగన్‌ ఇప్పటికైనా చెప్పాలి: చంద్రబాబు

రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఏర్పాటు చేసిన ‘రా.. కదలిరా’ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెదేపాలో చేరారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పల్నాడు జిల్లాలో తలపెట్టిన వాటర్‌గ్రిడ్‌, వరికిపుడిసెల ఎత్తిపోతలను ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకంపై విధివిధానాలు, నిబంధనలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. హూతీల దాడులు.. నీట మునిగిన తొలి వాణిజ్య నౌక

వాణిజ్య నౌకలే లక్ష్యంగా యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు (Houthi Rebels) దాడులకు తెగబడుతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న బాబ్‌-అల్‌-మండెబ్‌ జలసంధి వద్ద దాడికి గురైన ఓ వాణిజ్య నౌక (MV Rubymar) తాజాగా ఎర్ర సముద్రం (Red Sea)లో మునిగిపోయింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఈ జలమార్గంలో నెలలతరబడి సాగుతోన్న దాడుల్లో మునిగిపోయిన మొదటి ఓడ ఇదే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దక్షిణాఫ్రికాలో ఎన్‌ఐఏకు చిక్కిన గ్యాంగ్‌స్టర్

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) గ్యాంగ్‌స్టర్‌ మహ్మద్ గౌస్ నియాజీని దక్షిణాఫ్రికాలో అరెస్టు చేసింది.  నియాజీ 2016లో బెంగళూరులో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్ఎస్ఎస్) నేత రుద్రేష్‌ను హత్య చేశాడు. అప్పటినుంచి పోలీసులకు దొరకకుండా విదేశాలకు చెక్కేశాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పంత్‌ వస్తున్నాడు..!

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏడాది పాటు ఆటకు దూరమైన క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) ఈ ఐపీఎల్‌ (IPL)లో ఆడతాడని దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు డైరెక్టర్‌, భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ వెల్లడించారు. పంత్‌కు మార్చి 5న జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA) నుంచి అనుమతి లభించే అవకాశం ఉందని, ఆ తర్వాత మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ కోసం జట్టు కెప్టెన్‌పై మెనేజ్‌మెంట్‌ ఆలోచిస్తుంది అన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తమిళనాడులో ఏపీ విద్యార్థి మృతి.. నలుగురి గల్లంతు

తమిళనాడులో ఏపీ విద్యార్థుల విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థుల బృందం రామేశ్వరం విహారయాత్రకు వెళ్లింది. వారిలో 9 మంది సముద్రంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని.. నలుగురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వృద్ధురాలిని ఇంట్లోనే బంధించి.. 30 తులాల బంగారం చోరీ

వృద్ధురాలిని మంచానికి కట్టేసి ..దుండగులు 30 తులాల బంగారం చోరీకి తెగబడ్డారు. శ్రీకాకుళం నగరంలోని సరంగడాల వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదాంబ (75) ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. విషయం తెలుసుకున్న దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెను మంచానికి తాళ్లతో కట్టేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు