Rishabh Pant: పంత్‌ వస్తున్నాడు..!

ఏడాది పాటు ఆటకు దూరమైన రిషబ్‌ పంత్‌  2024 ఐపీఎల్‌లో ఆడటానికి ఎన్‌సీఏ (NCA) నుంచి మార్చి 5న అనుమతి లభించే అవకాశం ఉంది. 

Published : 02 Mar 2024 18:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏడాది పాటు ఆటకు దూరమైన క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) ఈ ఐపీఎల్‌ (IPL)లో ఆడతాడని దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు డైరెక్టర్‌, భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ వెల్లడించారు. పంత్‌కు మార్చి 5న జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA) నుంచి అనుమతి లభించే అవకాశం ఉందని, ఆ తర్వాత మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ కోసం జట్టు కెప్టెన్‌పై మెనేజ్‌మెంట్‌ ఆలోచిస్తుంది అన్నారు.
‘‘మార్చి 5న పంత్‌కు అనుమతి లభించనివ్వండి. వెంటనే జట్టులో చేరతాడు. అప్పుడే కెప్టెన్సీ గురించి మాట్లాడతాము. అతనికి సుదీర్ఘమైన కెరీర్‌ ఉంది.  మ్యాచ్‌ల వారీగా పంత్‌ ఆటను చూస్తాం. ఇప్పుడే అంచనా వేయలేము’’ అని గంగూలీ అన్నాడు.  వికెట్‌ కీపింగ్‌ బాధ్యతల నుంచి తప్పుకుని బ్యాటర్‌గానే పంత్‌ కొనసాగనున్నాడు. దీనిపై మాట్లాడుతూ జట్టులో అనేక ప్రత్యామ్నాయ ఆటగాళ్లు ఉన్నారన్నారు. ‘‘వికెట్‌ కీపింగ్‌లో కుమార్‌ కుశాగ్రా, రిక్కి భుయ్‌, షాయ్‌ హోప్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌ ఉన్నారు. పంత్‌ పూర్తి ఫిట్‌గా తిరిగొస్తే జట్టుకు మరింత బలం. అన్ని ఫార్మాట్లలో ప్రతిభ చూపిన ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. అయినా పంత్‌ టీమ్‌లో చాలా ముఖ్యమైన వాడు. అతడు పూర్తి సీజన్‌ ఆడాలని ఆశిస్తున్నాం’’. 

మార్చి 31, ఏప్రిల్ 3న చెన్నై, కోల్‌కతా జట్లతో దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లు విశాఖలో జరగనున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు