Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 20 Apr 2024 21:01 IST

1.  కేజీఎఫ్‌-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి: చంద్రబాబు

జగన్‌ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఐదుగురు అవినీతి పరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్‌, విజయసాయి, పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి దోచుకుంటుంటే ఆరో వ్యక్తి కాకాణి దోపిడీ యథేచ్చగా జరుగుతోందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. 22న ఏపీ పదోతరగతి ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 22న ఉదయం 11గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ ప్రకటిస్తారని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. దేశవిదేశాల్లోని శక్తిమంతులు ఏకమై.. నన్ను తొలగించే యత్నం: పీఎం మోదీ

తనను అధికారంలో నుంచి తొలగించేందుకు దేశ, విదేశాల్లోని శక్తిమంతులైన వ్యక్తులు చేతులు కలిపినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో కర్ణాటక (Karnataka)లోని చిక్కబళ్లాపురలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్టు

 బంగారంలో పెట్టుబడి అంటూ రూ.6.12 కోట్లు మోసం చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను సైబరాబాద్‌ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. కొండాపూర్‌లో నివాసముంటున్న పుత్తూరుకు చెందిన గంట శ్రీధర్‌.. 13 మంది నుంచి రూ.6.12 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బంగారం కోసం గ్రాముకు రూ.5,950 చొప్పున పెట్టుబడి పెడితే, సుమారుగా 25 రోజుల్లో బంగారం ఇస్తానని బాధితులకు తెలిపాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్‌రెడ్డి

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నానని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న భారాస ఇప్పుడు కష్టాల్లో ఉందన్న ఆయన.. పార్టీలో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని తెలిపారు. ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు చేయడం వల్లే పార్టీ కష్టాల్లో పడిందని అభిప్రాయపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఎన్నికల బాండ్లపై సీతారామన్‌ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్‌

కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే.. ఎన్నికల బాండ్ల పథకాన్ని (electoral bonds scheme) పునరుద్ధరిస్తామంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. డిపాజిట్‌ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు

ఎన్నికల్లో డిపాజిట్‌ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్‌ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. ఇది 1952 నాటి కథ. మద్రాస్‌ రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన ఆ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పరవాడ నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది పోటీ చేశారు. 60,780 ఓట్లు ఉంటే 25,511 ఓట్లు పోలయ్యాయి. సీపీఐ తరుపున బరిలో దిగిన ముళ్లపూడి వీరభద్రం (ఎంవీ భద్రం)కు 7,064 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి జగన్నాథరాజుకు 4,347 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎల్‌జీఏ రావుకు 3,109.. కృషికార్‌ లోక్‌ పార్టీ అభ్యర్థి ఈటి నాగయ్యకు 1,158  ఓట్లు వచ్చాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. మీ హయాంలోనే ఈడీ, సీబీఐ: కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి కౌంటర్‌

కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను మోదీ సర్కార్‌ తమపై ప్రయోగిస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ (Arjun ram meghwal) స్పందించారు. వీటిని కాంగ్రెస్‌ హయాంలోనే ప్రవేశపెట్టినట్లు గుర్తు చేసిన ఆయన ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇటీవల ప్రవేశపెట్టిన భారతీయ న్యాయసంహిత చట్టాలపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మేఘ్వాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ప్రజలు బెంజ్‌ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

 త్వరలో జరగనున్న ఎన్నికలపై హీరో విశాల్‌ (vishal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించిన ‘రత్నం’ (Ratnam) ప్రెస్‌మీట్‌లో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. అందరూ మే 13న ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తాను తమిళనాడులో ఓటు వేసినట్లు తెలిపారు. అక్కడ 70శాతం ఓటింగ్‌ నమోదైందని.. ఇంకొక 20 శాతం నమోదైనట్లైతే విప్లవాత్మకమయ్యేదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్‌ వ్యాఖ్యలపై కేసు నమోదు

 సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) వేళ రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ప్రధాన నాయకులంతా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈక్రమంలో కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ (Congress) నేత డీకే శివకుమార్‌ (DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన సోదరుడు సురేశ్ తరఫున ప్రచారంలో భాగంగా డీకే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ ఫిర్యాదులు వచ్చాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని