icon icon icon
icon icon icon

డిపాజిట్‌ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు

ఎన్నికల్లో డిపాజిట్‌ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్‌ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది.

Published : 20 Apr 2024 17:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్నికల్లో డిపాజిట్‌ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్‌ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. ఇది 1952 నాటి కథ. మద్రాస్‌ రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన ఆ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పరవాడ నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది పోటీ చేశారు. 60,780 ఓట్లు ఉంటే 25,511 ఓట్లు పోలయ్యాయి. సీపీఐ తరుపున బరిలో దిగిన ముళ్లపూడి వీరభద్రం (ఎంవీ భద్రం)కు 7,064 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి జగన్నాథరాజుకు 4,347 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎల్‌జీఏ రావుకు 3,109.. కృషికార్‌ లోక్‌ పార్టీ అభ్యర్థి ఈటి నాగయ్యకు 1,158  ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో డిపాజిట్‌ దక్కాలంటే పోలైన ఓట్లలో మూడో వంతు అంటే 8,504 ఓట్లు రావాలి. ఎవరికీ ఆ స్థాయి ఓట్లు రాకపోవడంతో విజేతను ప్రకటించడం సాధ్యం కాదని అధికారులు తేల్చారు. ప్రత్యర్థిపై ఒక్క ఓటు అదనంగా వచ్చినా విజేతనని కమ్యూనిస్ట్‌లు పట్టుపట్టడంతో ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు వీరభద్రంను ఎమ్మెల్యేగా ప్రకటించారు. 1955లో జరిగిన ఎన్నికల్లో డిపాజిట్‌ విధానాన్ని మార్చారు. పోలైన ఓట్లలో ఆరో వంతు వస్తే చాలని నిబంధ పెట్టారు. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన సమయంలో పరవాడను రద్దు చేసి పెందుర్తిలో విలీనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img