icon icon icon
icon icon icon

LS Polls: దేశవిదేశాల్లోని శక్తిమంతులు ఏకమై.. నన్ను తొలగించే యత్నం: పీఎం మోదీ

తనను అధికారం నుంచి తొలగించేందుకు దేశ, విదేశాల్లోని శక్తిమంతులైన వ్యక్తులు ఏకమైనట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

Published : 20 Apr 2024 19:00 IST

బెంగళూరు: తనను అధికారంలో నుంచి తొలగించేందుకు దేశ, విదేశాల్లోని శక్తిమంతులైన వ్యక్తులు చేతులు కలిపినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో కర్ణాటక (Karnataka)లోని చిక్కబళ్లాపురలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు.

‘‘మాతృమూర్తులు, సోదరీమణులు ఇక్కడికి పెద్దసంఖ్యలో వచ్చారు. కుటుంబపోషణలో భాగంగా మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు, చేస్తోన్న పోరాటం గురించి తెలుసు. దేశ, విదేశాల్లోని శక్తిమంతులైన వ్యక్తులు నన్ను అధికారం నుంచి తొలగించేందుకు ఏకమయ్యారు. కానీ.. నారీ, మాతృశక్తుల ఆశీర్వాదంతో వారితో పోరాడగలుగుతున్నాను. మహిళల భద్రతే నా ప్రాధాన్యం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ యువరాజు ఏప్రిల్ 26 తర్వాత ఎక్కడికి వెళ్తారో..?: మోదీ

ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో దిశానిర్దేశం చేసేందుకు ఒక్క నాయకుడూ లేడని ప్రధాని మోదీ ఈసందర్భంగా ఎద్దేవా చేశారు. అందులోని భాగస్వామ్య పక్షాలకు ఎటువంటి భవిష్యత్తు కార్యాచరణ లేదని, వాటి చరిత్ర అంతా కుంభకోణాలతో నిండిఉందని విమర్శలు గుప్పించారు. 102 స్థానాల్లో శుక్రవారం నిర్వహించిన తొలిదశ పోలింగ్‌.. ఎన్డీయే, ‘వికసిత్‌ భారత్‌’కు అనుకూలంగా సాగిందని చెప్పారు.

సభలో భాగంగా వేదిక పంచుకున్న మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవగౌడపై మోదీ ప్రశంసలు కురిపించారు. 90 ఏళ్లలోనూ ఆయన ఉత్సాహం, నిబద్ధత తనలో స్ఫూర్తి నింపినట్లు తెలిపారు. జేడీఎస్‌ గతేడాది సెప్టెంబరులో ఎన్డీయేలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా.. మొత్తం 28 స్థానాలున్న కర్ణాటకలో రెండు విడతల్లో (ఏప్రిల్‌ 26, మే 7) పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img