icon icon icon
icon icon icon

Arjun ram meghwal: మీ హయాంలోనే ఈడీ, సీబీఐ: కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి కౌంటర్‌

ప్రతిపక్షాలపై కేంద్రంలోని భాజపా ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తోందని వస్తున్న ఆరోపణలపై కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ స్పందించారు. 

Published : 20 Apr 2024 17:36 IST

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను మోదీ సర్కార్‌ తమపై ప్రయోగిస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ (Arjun ram meghwal) స్పందించారు. వీటిని కాంగ్రెస్‌ హయాంలోనే ప్రవేశపెట్టినట్లు గుర్తు చేసిన ఆయన ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇటీవల ప్రవేశపెట్టిన భారతీయ న్యాయసంహిత చట్టాలపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మేఘ్వాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘కేంద్ర దర్యాప్తు సంస్థలను తమపై ప్రయోగిస్తోందంటూ భాజపాపై ప్రతిపక్షాలు ఆరోపించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి మీరు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) అధికారంలో ఉన్నప్పుడే వీటి ఏర్పాటు జరిగింది కదా. అప్పటినుంచే అవి పనిచేస్తున్నాయి. దీనిపై మీరు ఎందుకు చింతిస్తున్నారు. చట్టం ప్రకారమే చర్యలు అమలవుతాయి. కేంద్రంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఈ అసత్య ప్రచారాలు ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారుతున్నాయి’’ అని మేఘ్వాల్‌ కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చారు. 

ఐదేళ్లకు ఒకసారి దేశం కోసం ఐదు నిమిషాలు: ఓటు హక్కుపై జస్టిస్ డీవై చంద్రచూడ్

నూతన క్రిమినల్‌ చట్టాలపై ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ సహా పలువురు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు ఈడీ చీఫ్‌ రాహుల్‌ నవీన్‌, సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్ సూద్ హాజరయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img