Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 26 May 2024 20:59 IST

1. మాచర్లలో ఆగని వైకాపా ఆగడాలు.. మహిళపై కత్తితో దాడి

పల్నాడు జిల్లా మాచర్లలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. పట్టణంలోని 22వ వార్డులో వైకాపాకి చెందిన ఉప్పుతోళ్ల వెంకేటశ్‌.. నీలావతి అనే మహిళపై కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేశాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. తల్లిపాలు విక్రయిస్తే కఠిన చర్యలు..: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హెచ్చరిక

తల్లి పాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ‘ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI)’ హెచ్చరించింది. FSS 2006 చట్టం ప్రకారం తల్లి పాలను విక్రయించడానికి అనుమతి లేదని, వాటిని ఉపయోగించి చేస్తోన్న వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

3. అత్యాచార, హత్య బెదిరింపులు వస్తున్నాయి: స్వాతి మాలీవాల్‌

ఆప్‌ నేతలు తనకు వ్యతిరేకంగా దుష్ఫ్రచారాలు చేస్తున్నారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal) ఆరోపించారు. దీని వల్ల తనకు అత్యాచార, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబర్ ధ్రువ్ రాథీ (Dhruv Rathee) తనకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసినప్పటి నుంచి బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. నకిలీ ఇంటర్నేషనల్‌ కాల్స్‌.. టెలికాం సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు!

భారతీయ మొబైల్ నంబర్లతో వచ్చే అన్ని అంతర్జాతీయ నకిలీ కాల్స్‌ను బ్లాక్ చేయాలని టెలికాం ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది. దేశీయ పౌరులకు స్థానిక నంబర్లతో మోసగాళ్లు అంతర్జాతీయ కాల్స్‌ చేస్తూ సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు టెలికాం విభాగం (DoT) తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. జనం గుమిగూడి.. వీడియోలకు ఎగబడి..! దిల్లీ ఘటనలో ఫైర్‌ సిబ్బందికి సవాళ్లెన్నో..

దేశ రాజధాని దిల్లీలోని ఓ చిన్నారుల ఆస్పత్రిలో మంటలు చెలరేగి (Delhi Fire Accident) ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచివేసింది. అయితే, మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి ఘటనాస్థలంలో అనేక సవాళ్లు ఎదురైనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. రిక్రూట్‌మెంట్‌లోనూ ఏఐ హవా.. రెజ్యూమె పరిశీలన, ఇంటర్వ్యూల్లోనూ సాయం!

 ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. ప్రతి రంగంలోనూ దీని హవా వేగంగా విస్తరిస్తోంది. కేవలం కంపెనీలో పని చేసే ఉద్యోగులకే కాదు అభ్యర్థులను నియమించుకోవడంలో కూడా ఈ సాంకేతికతే సాయం చేస్తోంది. రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ను వేగవంతం చేయడంలో కృత్రిమ మేధ తన సత్తా చాటుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. జమ్మూకశ్మీర్‌ విషయంలో మా తదుపరి లక్ష్యం అదే: అమిత్‌ షా

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా ముగియడంపై కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah) హర్షం వ్యక్తం చేశారు. అక్కడ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన మోదీ సర్కార్‌.. కశ్మీర్‌ విధానాన్ని నిరూపించుకుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. కొలువు కొట్టాలంటే..  ఈ నైపుణ్యాల్ని ఒడిసిపట్టాల్సిందే..!

కాలం మారింది. కేవలం పుస్తకాలు బట్టిపట్టి చదివితే సరిపోదు.. మార్కెట్‌కు తగిన స్కిల్స్‌ నేర్చుకుంటేనే మంచి కెరీర్‌. ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ ఈ పోటీ ప్రపంచంలో నైపుణ్యాల్లేకపోతే కొలువులు కొట్టడం అసాధ్యం. ఉద్యోగం వచ్చినా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కాకపోతే అందులో నిలదొక్కుకోవడమూ కష్టమే. అందుకే ఉద్యోగార్హతలకు తగిన నైపుణ్యాలను నేర్చుకొని వాటిపై పట్టు పెంచుకోవాలంటున్నారు నిపుణులు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ముందు అరెస్టు.. తర్వాత ఎన్నికల్లోకి.. మోదీ సర్కార్‌పై కేజ్రీవాల్‌ ఆరోపణలు

దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. భాజపాపై విరుచుకుపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. తీవ్ర తుపానుగా బలపడిన రెమాల్‌.. గంటకు 120కి.మీ. వేగంతో గాలులు

తీవ్ర తుపానుగా బలపడిన ‘రెమాల్’ ఇవాళ అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణశాఖ (I.M.D) వెల్లడించింది. తుపాను ప్రభావంతో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున NDRF సిబ్బందిని రంగంలోకి దించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని