
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు @ 5 PM
1. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఆలోచనలేదు: మంత్రి సురేశ్
కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. గుంటూరు జిల్లా కాకుమానులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. 36 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు
సోమవారం సికింద్రాబాద్ పరిధిలో 36 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మతుల నిమిత్తం ఈ సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. నిత్యం నడిపే 79 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో రేపు 36 సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. రేపట్నుంచి ఓయూ, జేఎన్‌టీయూహెచ్‌పరిధిలో ఆన్‌లైన్ తరగతులు
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో రేపటి నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈనెల 30 వరకూ ఓయూ పరిధిలో ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయని తెలిపింది. డిగ్రీ, పీజీ తరగతులకు ఆన్‌లైన్ తరగతులు ఉంటాయని పేర్కొంది. జేఎన్‌టీయూ హైదరాబాద్ పరిధిలోనూ రేపట్నుంచి ఈ నెల 22 వరకు ఆన్‌లైన్ తరగతులు ఉంటాయని జేఎన్‌టీయూహెచ్ అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. టెస్లాకు మరో రాష్ట్రం రెడ్ కార్పెట్!
ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ను మరో రాష్ట్రం పెట్టుబడుల కోసం ఆహ్వానించింది. టెస్లా కంపెనీ స్థాపనకు తమ రాష్ట్రానికి రావాలని శుక్రవారం తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వాగతం పలకగా.. తాజాగా మహారాష్ట్ర సైతం అదే బాటలో పయనించింది. ఆ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి జయంత్ పాటిల్ ఈ మేరకు ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఎస్‌బీఐలో ఎఫ్‌డీ చేశారా.. అయితే మీకు ఓ శుభవార్త!
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. స్వల్పకాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు అంటే 0.1 శాతం పెంచింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. కాలపరిమితి 1-2 ఏళ్ల మధ్య ఉన్న రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 5 శాతం నుంచి 5.1 శాతానికి పెంచింది. ఇవి నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. బిహార్‌లో కల్తీ మద్యం కలకలం..మరో 11మంది బలి
బిహార్‌లోని నలంద జిల్లాలో కల్తీ మద్యం తీవ్ర విషాదం మిగిల్చింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం పూర్తిస్థాయిలో అమలులో ఉన్నప్పటికీ కల్తీ మద్యం తాగి తాజాగా మరో 11 మంది మృతిచెందడం కలకలం రేపుతోంది. కల్తీ మద్యాన్ని నియంత్రించడంలో వైఫల్యం చెందిన ఎస్‌హెచ్‌వోను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ₹10లక్షలు వస్తుంటే.. ఆ ₹2వేలు ఎందుకు?: కేజ్రీవాల్
ఎన్నికల ప్రచారంలో భాగంగా గోవాలో పర్యటిస్తున్న దిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే గోవాలోని యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం రాకపోతే నెలకు రూ. 3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్‌కి ఓటు వేస్తే సంక్షేమ పథకాల ద్వారా గోవా ప్రజలకు రూ.10లక్షలు అందుతాయి. అలాంటప్పుడు రూ.2 వేలు తీసుకొని ఇతర పార్టీలకు ఓటు వేయడమెందుకని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. పెరిగిన మారుతీ కార్ల ధరలు
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) మరోసారి ధరల్ని పెంచింది. వివిధ మోడళ్లపై 4.3 శాతం వరకు ధరల్ని పెంచినట్లు శనివారం ప్రకటించింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు వెల్లడించింది. నిర్వహణ ఖర్చులు, ముడి సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. జకోవిచ్‌కు మళ్లీఎదురు దెబ్బ.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడటం అసాధ్యం!
అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకోవాలన్న కోరిక జకోవిచ్‌కు ఇప్పట్లో తీరేలా లేదు. ఆస్ట్రేలియా ఓపెన్‌ను సొంతం చేసుకుని ఎక్కువ గ్రాండ్‌స్లామ్‌లు (21) సొంతం చేసుకుని రికార్డు సృష్టిద్దామని భావించిన జకోవిచ్‌కు వ్యాక్సినేషన్ వ్యవహారం అడ్డంకిగా మారింది. టోర్నీలో ఆడకుండా ఆస్ట్రేలియా మంత్రి రద్దు చేసిన వీసాను పునరుద్ధరించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను అక్కడి ఫెడరల్ న్యాయస్థానం కొట్టేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. విరాట్..నాకు ఆ రోజు ఇంకా గుర్తుంది: అనుష్క శర్మ
టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన నేపథ్యంలో విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశం పోస్టు చేసింది. ‘‘2014లో ఎంఎస్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ కాబోతున్నాడని .. తదుపరి భారత కెప్టెన్‌గా ఎంపిక అవుతున్నట్లు చెప్పిన రోజు నాకింకా గుర్తుంది. ఆ తర్వాత ఓ రోజు ఎంఎస్‌డీ, నువ్వు, నేనూ మాట్లాడుకుంటూ ‘నీ గడ్డం ఎంత త్వరగా నెరిసిపోతుందో చూడు’ అని ధోనీ వేసిన జోక్‌ను బాగా ఎంజాయ్ చేశాం కదా...పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Advertisement