Virat-Anushka: విరాట్..నాకు ఆ రోజు ఇంకా గుర్తుంది: అనుష్క శర్మ
టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన నేపథ్యంలో విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ...
ఇంటర్నెట్ డెస్క్: టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన నేపథ్యంలో విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశం పోస్టు చేసింది. ‘‘2014లో ఎంఎస్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కాబోతున్నాడని .. తదుపరి భారత కెప్టెన్‌గా ఎంపిక అవుతున్నట్లు చెప్పిన రోజు నాకింకా గుర్తుంది. ఆ తర్వాత ఓ రోజు ఎంఎస్డీ, నువ్వు, నేనూ మాట్లాడుకుంటూ ‘నీ గడ్డం ఎంత త్వరగా నెరిసిపోతుందో చూడు’ అని ధోనీ వేసిన జోక్‌ను బాగా ఎంజాయ్ చేశాం కదా. ఆ రోజు నుంచి నీ గడ్డం నెరవడం చూడటమే కాకుండా నీలో ఎంతో వృద్ధిని చూశా. టీమ్ఇండియా కెప్టెన్‌గా నీ ఎదుగుదలతో పాటు సాధించిన విజయాలకు ఎంతో గర్వపడుతున్నా. ఈ ఏడేళ్లలో నేర్చుకున్న విషయాలను తండ్రిలో మన పాపాయి తప్పకుండా చూస్తుంది’’ అని పోస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మ చేసిన పోస్ట్ మీ కోసం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్‌గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్‌కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్‌కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్‌కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్‌కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్‌లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
రుషికొండలో ఏం జరిగింది?!
-
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
-
Israel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
-
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
-
దుస్తుల్లేని చిన్ననాటి ఫొటోపై అభ్యంతరం.. అకౌంట్‌ను నిలిపివేసిన గూగుల్
-
అయిదు పదుల వయసులోనూ పది పరీక్షకు హాజరు