
Hyderabad MMTS Servises: 36 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు
హైదరాబాద్: సోమవారం సికింద్రాబాద్ పరిధిలో 36 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మతుల నిమిత్తం ఈ సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. నిత్యం నడిపే 79 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో రేపు 36 సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
రద్దు చేసిన సర్వీసులు ఇవే..
* లింగంపల్లి - హైదరాబాద్ (9 సర్వీసులు)
* హైదరాబాద్ - లింగంపల్లి (9 సర్వీసులు)
* ఫలక్నుమా - లింగంపల్లి (8 సర్వీసులు)
* లింగంపల్లి - ఫలక్నుమా (8 సర్వీసులు)
* సికింద్రాబాద్ - లింగంపల్లి (1 సర్వీసు)
* లింగంపల్లి - సికింద్రాబాద్ (1 సర్వీసు)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.