Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Mar 2024 17:10 IST

1. చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)తో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) భేటీ అయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఇరువురూ మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో (Andhra Pradesh Assembly Elections) అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై నేతలిద్దరూ సుమారు గంటపాటు చర్చించుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీఈవో ఎదుట హాజరైన పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు

గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మూడు హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కె.రఘువీరారెడ్డిలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రజాకార్‌ సినిమా నిర్మాతకు భద్రత కల్పించిన కేంద్ర హోంశాఖ

రజాకార్‌ సినిమా (Razakar Movie) నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించారు. తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణరెడ్డికి భద్రతగా 1+1 సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విజయవాడలో పాస్‌పోర్టు సేవలకు అంతరాయం

నగరంలోని పాస్‌పోర్టు సేవా కేంద్రంలో సేవలకు అంతరాయం కలిగింది. సుమారు గంటన్నరపాటు సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో సర్వర్‌ పనిచేయలేదని అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలిపారు. విజయవాడ పాస్‌పోర్టు కేంద్రంలో రోజుకు 550 నుంచి 600 స్లాట్లు ఇస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేజ్రీవాల్‌కు షాక్‌.. అరెస్టు నుంచి మినహాయింపుల్లేవన్న కోర్టు

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎకరాకు రూ.10 - 15 వేల నష్ట పరిహారం: మంత్రి జూపల్లి

వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో పొలాలను మంత్రి పరిశీలించారు. వర్షం కారణంగా పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు రూ.10వేల నుంచి 15వేల వరకు పరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చెన్నై సూపర్ కింగ్స్‌ సారథిగా రుతురాజ్‌ గైక్వాడ్

చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) కొత్త సారథిని నియమించింది. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ కీలక ప్రకటన చేసింది. భారత మాజీ కెప్టెన్, ఐదుసార్లు సీఎస్కేను ఛాంపియన్‌గా నిలిపిన ఎంఎస్ ధోనీ స్థానంలో రుతురాజ్‌కు బాధ్యతలు అప్పగించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘ఫెడ్‌’ జోష్‌.. 500 పైగా పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలు రాణించాయి. కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తూనే.. ఈ ఏడాదిలోనే మూడుసార్లు వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని ఫెడ్‌ చీఫ్‌ సంకేతాలు ఇవ్వడం సెంటిమెంట్‌ను బలపరిచింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ రాణించాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వాట్సప్‌ కొత్త ఫీచర్‌.. త్వరలో టెక్ట్స్‌ రూపంలోకి వాయిస్‌ మెసేజ్‌!

స్నేహితులు, కుటుంబ సభ్యులకు సుదీర్ఘ సందేశం పంపాలనుకున్నప్పుడు వాట్సప్‌ వాయిస్‌ మెసేజ్‌ (WhatsApp voice message) ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, దీంట్లోనూ కొన్ని పరిమితులు ఉన్నాయి. వాయిస్‌ నోట్‌ అందగానే వివిధ కారణాల వల్ల అన్ని సందర్భాల్లో దాన్ని ప్లే చేసి వినలేం. దానికి పరిష్కారంగా వాట్సప్‌ ఓ కొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తున్నట్లు వాబీటాఇన్ఫో వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హోటల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం.. బిర్యానీలో ఉంగరం

పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఓ రెస్టారంట్‌లో బిర్యానీలో ఉంగరం రావడంతో ఆహార ప్రియులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది యువకులు భోజనం చేయడానికి ఓ రెస్టారంట్‌కు వెళ్లారు. బిర్యానీ తింటుండగా అందులో ఉంగరం కనిపించడంతో కంగుతిన్నారు. వెంటనే సిబ్బందిని నిలదీశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని