Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 May 2024 17:04 IST

1. ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్‌ నివేదిక అందజేత!

ఏపీలో ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్‌ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు అందించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణ మంత్రివర్గం భేటీ ప్రారంభం.. వీటిపైనే చర్చ!

తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. జూన్‌ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని ఈసీ షరతు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ధాన్యం కొనుగోళ్లు, విద్యాసంస్థల్లో వసతులు, మేడిగడ్డ బ్యారేజీ, మరికొన్ని అత్యవసర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ మళ్లీ పొడిగింపు

దిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. జూన్‌ 3 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన

అబిడ్స్‌లోని శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. దీంతో బాధితులంతా బషీర్‌బాగ్‌ సీసీఎస్‌ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. జూన్‌ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు

చేప ప్రసాదం పంపిణీ జూన్‌ 8 ఉదయం 11 నుంచి జూన్‌ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ ఉంటుందని తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్‌ లీలా బన్సాలీ

రేషన్‌ కోసం క్యూలో నిలబడే సగటు మహిళలతో పోలిస్తే, వేశ్యలు, సెక్స్‌ వర్కర్ల పాత్రలను వెండితెరపై ఆవిష్కరించడం తనకు ఎంతో ఆసక్తిగా ఉంటుందని ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కు వేళైంది. దాదాపు రెండునెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నాలుగు జట్లు నాకౌట్‌ దశకు చేరుకున్నాయి. రెండు జట్లు అలవోకగా వచ్చినా.. మరో రెండు సంచలన ప్రదర్శనతో ఫైనల్‌ 4కి చేరాయి. ఎవరి ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం! పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

8. బాలుడి డ్రైవింగ్‌తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్‌ను వ్యాసం రాయమన్న కోర్టు

మహారాష్ట్రలోని పుణెలో ఓ బాలుడి నిర్లక్ష్యం ఇద్దరి యువకుల జీవితాలను బలితీసుకుంది. ఈ కేసులో ఆ మైనర్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేయగా.. ఆ సమయంలో విధించిన షరతులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మారణాయుధాలతో హ్యారీ విన్‌స్టన్‌లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ

లగ్జరీ ఉత్పత్తుల కంపెనీ ‘హ్యారీ విన్‌స్టన్’ (Harry Winston)లో భారీ చోరీ జరిగింది. మారణాయుధాలతో కంపెనీ లోపలికి ప్రవేశించిన కొందరు దుండగులు రూ. కోట్ల విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ దర్యాప్తు కార్యాలయం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇరాన్‌ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్‌ ప్రమేయం ఉందా?

హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ (Iran) అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. హెలికాప్టర్‌ ప్రమాదంలో శత్రుదేశం ఇజ్రాయెల్‌ (Israel) పాత్ర ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైసీ మరణంలో తమకు ఎటువంటి ప్రమేయం లేదని అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇజ్రాయెల్‌ స్పష్టంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని