Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Sep 2023 09:20 IST

1. పాస్‌వర్డా? పాస్‌కీనా?

ఆన్‌లైన్‌ ఖాతాలకు పాస్‌వర్డ్‌లు వాడుతూనే ఉంటాం. కానీ త్వరలోనే ఇవి తెరమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుత ధోరణి ఇలాగే అనిపిస్తోంది. పాస్‌వర్డ్‌ స్థానంలో పాస్‌కీ వేగంగా దూసుకొస్తోంది మరి. ఇప్పటికే దీన్ని కొన్ని సంస్థలు అమల్లోకి తెచ్చాయి కూడా. ఇంతకీ పాస్‌కీ అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది?పాస్‌వర్డ్‌ ఎంత బలంగా ఉంటే, ఎంత విభిన్నంగా ఉంటే అంత సురక్షితం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆడే అవకాశం రాదని..

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తాను తుది జట్టులో ఉంటానని అనుకోలేదని అందుకే హోటల్‌ నుంచి మైదానానికి కిట్‌ కూడా తెచ్చుకోలేదని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ వెన్ను గాయం కారణంగా దూరం కావడంతో ఆఖరి నిమిషంలో కేఎల్‌కు చోటు కల్పించారు. తొడ గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన 31 ఏళ్ల రాహుల్‌.. పాకిస్థాన్‌పై 106 బంతుల్లో అజేయంగా 111 పరుగులు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్లాస్టిక్‌తో సంతాన సమస్యలు..

శరీరంలో ప్లాస్టిక్‌ చేరితే సంతాన సమస్యలు తలెత్తుతాయని ఎన్‌ఐఎన్‌ (జాతీయ పోషకాహార సంస్థ) హెచ్చరించింది. ప్లాస్టిక్‌ తయారీలో వినియోగించే ‘బిస్‌ ఫినాల్‌ ఏ-బీపీఏ’ రసాయనం ప్రభావంతో మగవారిలో సంతాన ఉత్పాదకత దెబ్బతింటుందని తమ పరిశోధనల్లో తేలిందని మంగళవారం ఎన్‌ఐఎన్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంపు!

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన దస్త్రం విద్యాశాఖ నుంచి సీఎం కేసీఆర్‌ పరిశీలనకు పంపించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆచార్యుల పదవీ విరమణ వయసు 60గా ఉండగా... ప్రభుత్వ ఉద్యోగులకు మూడేళ్ల క్రితమే 58 నుంచి 61కి పెంచారు. ఏడాదిన్నర క్రితం మాత్రం వారి పదవీ విరమణ వయసు పెంచడం లేదని ప్రభుత్వం లిఖితపూర్వక ఉత్తర్వులు ఇచ్చింది. మళ్లీ కొద్ది రోజులుగా పెంచే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రహస్యంగా పోర్న్‌ చూడటం వ్యక్తిగతం: కేరళ హైకోర్టు తీర్పు

రహస్యంగా పోర్న్‌ ఫొటోలు, వీడియోలు చూడటం వ్యక్తిగతమని, అటువంటి ఘటనలపై కేసు నమోదు చేయడం చట్టరీత్యా చెల్లదని, అలా చేస్తే వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడంతోపాటు వ్యక్తిగతేచ్ఛను అడ్డుకున్నట్లే అవుతుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. పోర్నోగ్రఫీ అనేది శతాబ్దాలుగా కొనసాగుతోందని, డిజిటల్‌ యుగంలో మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చిందని న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ పేర్కొన్నారు. నిందితుడిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. యుద్ధ సమయాల్లో అలా అంటే ఎలా?

ఉక్రెయిన్‌లో గత ఏడాది స్టార్‌లింక్‌ సేవలను వినియోగించుకునేందుకు స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ అనుమతినివ్వకపోడం అమెరికా రక్షణ వర్గాలను సందేహంలో పడేశాయి. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులపై ఆధారపడితే యుద్ధం వంటి కీలక సమయాల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో ఈ ఉదంతం వెలుగులోకి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పైసా ప్రయోజనం లేని స్మార్ట్‌మీటర్లకు... రూ.6,888 కోట్ల ఖర్చును ఏమంటారు జగన్‌?

గత ప్రభుత్వం రూ.371 కోట్లు వెచ్చించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు నోట్‌ఫైల్స్‌లో రొటీన్‌గా రాసిన కొన్ని వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు పెట్టి జైలుకు పంపినట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. మరి వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్ల ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఒకటికి రెండుసార్లు లేఖలు రాసినా, ఆ ప్రాజెక్టు వల్ల పెద్దగా ప్రయోజనం లేదని చెప్పినా వినకుండా...  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కొట్టేదీ... కేసు కట్టేదీ.. వారే!

ఆమె దళిత మహిళ.. మాజీ శాసన సభ్యురాలు.. ఆమె ప్రసంగాలు మర్యాద, గౌరవవాచకాలతో.. సాధారణంగా ఉంటాయి. కానీ ఆమె దుష్ప్రవర్తన కలిగి ఉన్నారనీ, దూషించారనీ, రెచ్చగొట్టే ప్రసంగాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేశారనీ, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఆమే... నందిగామ మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొత్తవి ఇవ్వరు.. పేర్లు చేర్చరు

ఆహార భద్రత కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వేలాది మంది లబ్ధిదారులు ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టింపులేనట్లుగా ఉంటోంది. దీంతో వేలాది మందికి ఆహారభద్రత పథకం అందడం లేదు. కామారెడ్డిలో 2.53 లక్షలు, నిజామాబాద్‌లో 4.02 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాల్లో కొత్తగా జన్మించిన వారి పేర్లు కార్డుల్లో చేర్చడానికి స్థానికంగా వీలులేకుండా పోయింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఐరాసకు వెళుతున్న ఏపీ బృందంలో ఐప్యాక్‌ సభ్యురాలు

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ)పై న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరగనున్న సమావేశానికి ఏపీ నుంచి వెళ్తున్న బృందంలో ఐప్యాక్‌ సభ్యురాలికి స్థానం కల్పించడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే అనేక శాఖల్లో ఆ సంస్థ వారు అనధికారికంగా పెత్తనం చెలాయిస్తుండగా.. ఇప్పుడు చివరికి ప్రభుత్వం తరఫున అమెరికా వెళుతున్న బృందంలోనూ ప్రభుత్వం వారిని భాగస్వామిని చేసింది. వైకాపా రాజకీయ వ్యవహారాలను ఐప్యాక్‌ సంస్థ పర్యవేక్షిస్తోందన్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని