రహస్యంగా పోర్న్‌ చూడటం వ్యక్తిగతం: కేరళ హైకోర్టు తీర్పు

రహస్యంగా పోర్న్‌ ఫొటోలు, వీడియోలు చూడటం వ్యక్తిగతమని, అటువంటి ఘటనలపై కేసు నమోదు చేయడం చట్టరీత్యా చెల్లదని, అలా చేస్తే వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడంతోపాటు వ్యక్తిగతేచ్ఛను అడ్డుకున్నట్లే అవుతుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

Published : 13 Sep 2023 05:21 IST

కొచ్చి: రహస్యంగా పోర్న్‌ ఫొటోలు, వీడియోలు చూడటం వ్యక్తిగతమని, అటువంటి ఘటనలపై కేసు నమోదు చేయడం చట్టరీత్యా చెల్లదని, అలా చేస్తే వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడంతోపాటు వ్యక్తిగతేచ్ఛను అడ్డుకున్నట్లే అవుతుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. పోర్నోగ్రఫీ అనేది శతాబ్దాలుగా కొనసాగుతోందని, డిజిటల్‌ యుగంలో మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చిందని న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ పేర్కొన్నారు. నిందితుడిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేశారు. 2016లో కొచ్చిలోని అలువా ప్యాలెస్‌ సమీపంలో రోడ్డు పక్కన 33ఏళ్ల వ్యక్తి పోర్న్‌ చూస్తూ పోలీసులకు దొరికాడు. దీంతో ఐపీసీ 292 కింద వారు కేసు నమోదు చేశారు. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని