ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంపు!

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన దస్త్రం విద్యాశాఖ నుంచి సీఎం కేసీఆర్‌ పరిశీలనకు పంపించినట్లు తెలిసింది.

Published : 13 Sep 2023 04:58 IST

సీఎం పరిశీలనకు దస్త్రం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన దస్త్రం విద్యాశాఖ నుంచి సీఎం కేసీఆర్‌ పరిశీలనకు పంపించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆచార్యుల పదవీ విరమణ వయసు 60గా ఉండగా... ప్రభుత్వ ఉద్యోగులకు మూడేళ్ల క్రితమే 58 నుంచి 61కి పెంచారు. ఏడాదిన్నర క్రితం మాత్రం వారి పదవీ విరమణ వయసు పెంచడం లేదని ప్రభుత్వం లిఖితపూర్వక ఉత్తర్వులు ఇచ్చింది. మళ్లీ కొద్ది రోజులుగా పెంచే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో 62 ఏళ్లకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం పదవీ విరమణ చెందిన వారికి కూడా వర్తింపజేస్తారా? లేక జీవో వెలువడినప్పటి నుంచి అమలు చేసేలా ఉత్తర్వులు ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. పదవీ విరమణ పెంపుపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ పరిధిలో 11 విశ్వవిద్యాలయాల్లో 2,825 మంది బోధనా సిబ్బందికి బదులు కేవలం 873 మందే పనిచేస్తుండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని