ఐరాసకు వెళుతున్న ఏపీ బృందంలో ఐప్యాక్‌ సభ్యురాలు

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ)పై న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరగనున్న సమావేశానికి ఏపీ నుంచి వెళ్తున్న బృందంలో ఐప్యాక్‌ సభ్యురాలికి స్థానం కల్పించడం చర్చనీయాంశమవుతోంది.

Published : 13 Sep 2023 06:01 IST

ప్రజాధనంతో విదేశాలకు ప్రైవేటు వ్యక్తి

ఈనాడు, అమరావతి: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ)పై న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరగనున్న సమావేశానికి ఏపీ నుంచి వెళ్తున్న బృందంలో ఐప్యాక్‌ సభ్యురాలికి స్థానం కల్పించడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే అనేక శాఖల్లో ఆ సంస్థ వారు అనధికారికంగా పెత్తనం చెలాయిస్తుండగా.. ఇప్పుడు చివరికి ప్రభుత్వం తరఫున అమెరికా వెళుతున్న బృందంలోనూ ప్రభుత్వం వారిని భాగస్వామిని చేసింది. వైకాపా రాజకీయ వ్యవహారాలను ఐప్యాక్‌ సంస్థ పర్యవేక్షిస్తోందన్న విషయం తెలిసిందే. ఎస్‌డీజీపై ఐరాసలో జరగనున్న సమావేశానికి రాష్ట్రం నుంచి 10 మంది విద్యార్థులు, సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల కార్యదర్శి మధుసుధన్‌, పాఠశాల విద్య కమిషనరేట్‌లో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న టీచర్‌ విజయదుర్గా, ఐటీలో పని చేస్తున్న ప్రసాద్‌తోపాటు ఐరాస పర్మినెంట్‌ డెలిగేషన్‌ ఉన్నవ షకీన్‌ వెళ్తున్నారు. వీరితోపాటు మీడియా కన్సల్టెంట్‌గా ఐప్యాక్‌ బృందానికి చెందిన హరిదీప్‌ దుగల్‌నూ ప్రభుత్వం పంపిస్తోంది. ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ ప్రైవేటు సంస్థ అయిన ఐప్యాక్‌ సభ్యురాలికి ప్రభుత్వం స్థానం కల్పించింది. మీడియా కన్సల్టెంట్‌గా ఎవరినైనా పంపించాలనుకుంటే సమాచార, పౌరసంబంధాల విభాగం నుంచి అధికారిని పంపించొచ్చు. కానీ, ప్రభుత్వం మాత్రం ప్రజాధనంతో ప్రైవేటు వ్యక్తులను పంపిస్తోంది. ఈ నెల 14 నుంచి 28 వరకు ఈ బృందం అమెరికాలో పర్యటిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు