Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఆ నలుగురు ఎవరంటే? వ్యతిరేకంగా ఓటేసినవారెవరో గుర్తించిన వైకాపా
శాసనసభ్యుల కోటా శాసన మండలి ఎన్నికల్లో తెదేపాకు అదనంగా పోలైన నాలుగు ఓట్లు ఎవరు వేశారన్నది ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఇద్దరి విషయంలో అందరికీ అవగాహన ఉన్నప్పటికీ మిగిలిన ఇద్దరు ఎవరన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. రాజకీయ ఎత్తుగడల్లో లోపాలతో నష్టపోయామని భావిస్తున్న వైకాపా... ఫలితమొచ్చినప్పటి నుంచి ఆ ఇద్దరూ ఎవరో తెలుసుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. చివరికి నిబంధనలు అంగీకరించకపోయినా.. రివిజన్ పేరుతో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధకు పోలైన బ్యాలట్ పత్రాలను సైతం నిశితంగా పరిశీలించింది. చివరికి ఒక అవగాహనకు వచ్చినట్లుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటనను బట్టి అర్థమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి
2. ఫైనల్స్‌లో వైకాపా ఉండదు: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్స్ అని.. ఇందులో ఓడిపోతే ఫైనల్స్‌లో స్థానం ఉండబోదని వైకాపా నేతలే అన్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి వైకాపాకు ఎదురైంది’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో గురువారం రాత్రి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా పడిలేచిన కెరటమని, దేవుడు 23 సంఖ్య తమకు కలిసొచ్చేటట్లు చేశాడని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి
3. కోలా గురువులుకు మళ్లీ నిరాశే
విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపా నేత, మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేసిన కోలా గురువులుకు మరోసారి నిరాశే ఎదురైంది. చట్టసభల్లో అడుగుపెట్టాలనే ఆయన చిరకాల వాంఛ ఈసారీ తీరలేదు. ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడంతో గెలుపు ఖాయమని అంతా భావించారు. ఈ ఎన్నికలో తెదేపా అభ్యర్థి బరిలోకి దిగడంతో గురువులుకు మరోమారు ఓటమే మిగిలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి
4. ఇదో హెచ్చరిక.. సొంతగడ్డపై సిరీస్ ఓటమికి పెద్ద షాకే
స్థిరమైన జట్టు ఉండట్లేదు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఆటగాళ్లూ స్థిరంగా ఉండట్లేదు. ఉన్న ఆటగాళ్లలో నిలకడలేమి. వన్డేల్లో టీమ్‌ఇండియాను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ భారత జట్టులో లోపాలను బయటపెట్టింది. ఐపీఎల్‌లో పడి ఈ సిరీస్ వైఫల్యాన్ని మరిచిపోతే టీమ్‌ఇండియా ప్రపంచకప్ (అక్టోబరు-నవంబరు) సన్నాహాలకు అంతకన్నా దెబ్బ ఇంకోటి ఉండదు. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి
5.ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ ఎవరో గుర్తించాం: సజ్జల
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా నుంచి తెదేపాకు మద్దతుగా ఓటు వేసిన ఎమ్మెల్యేలను గుర్తించామని, వారి పేర్లు బయటపెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని, వారిపై సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తమది రాజకీయపార్టీ అని, పీకేయడానికి వారు ఉద్యోగులు కాదని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి
6. మరి.. ఇవి ఎవరి ఓట్లు? వైకాపా నాయకత్వంపై సొంత పార్టీలోనే విసుర్లు
శాసనమండలి పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పుడు.. ‘పట్టభద్ర ఓటర్లు వ్యవస్థీకృతమైనవాళ్లు. ప్రభుత్వ పథకాలతో సంబంధం లేని వర్గం. సంక్షేమ పథకాల్ని అందుకున్న ఓటర్లు చాలా తక్కువ. ఈ ఫలితాలను మొత్తానికి వర్తింపజేయటం సరికాదు’ అంటూ పరోక్షంగా వాళ్లు మా ఓటర్లు కాదన్న ధోరణిలో వైకాపా అగ్రనేతలు మాట్లాడారు. అదే సమయంలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపాకు బలం లేకపోయినా పోటీ చేస్తోందని, వారికి అవసరమైన సంఖ్యే లేదంటూ ఆక్షేపించారు. గురువారం ఫలితాలు రాగానే వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచే అగ్రనేతలపై ఘాటైన విమర్శల విసుర్లు వినిపించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి
7. పర్యాటక వీసాతోనూ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు
పర్యాటక, వ్యాపార వీసాలతో అమెరికాకు వచ్చినవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని అమెరికా తీపి కబురు అందించింది. ఉద్యోగంలో చేరేముందే ఆ వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బీ1 వీసాను వ్యాపార పనుల మీద వచ్చిన వారికి, బీ2 వీసాను పర్యాటకులకు అమెరికా జారీ చేస్తుంటుంది. ఆ దేశ తాజా నిర్ణయంతో ఈ రెండు వీసాల కేటగిరీలవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి
8. జులై-ఆగస్టులో డీఎస్సీకి ప్రయత్నిస్తున్నాం: బొత్స
పాధ్యాయ ఖాళీల భర్తీకి ఈ ఏడాది జులై-ఆగస్టులో డీఎస్సీ ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. జిల్లాల వారీగా ఖాళీలు, అదనపు అవసరాల వివరాలతో నివేదిక తయారుచేసి త్వరలో సీఎం ఆమోదం తీసుకుంటామని అన్నారు. సచివాలయంలోని మీడియా పాయింట్‌లో గురువారం ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి
9. క్యాన్సర్‌ను జయించి.. పంచుమర్తి స్ఫూర్తిదాయక ప్రస్థానమిదీ..
శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ రాజకీయ ప్రస్థానం అత్యంత ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని, ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆమె... 26 సంవత్సరాల పిన్న వయసులోనే ప్రత్యక్ష ఎన్నికల్లో విజయవాడ మేయర్‌గా ఎన్నికై అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. తెదేపాలోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అనురాధ... 23 సంవత్సరాలుగా పార్టీనే అంటిపెట్టుకుని క్రమశిక్షణగల కార్యకర్తగా, సమర్థతగల నాయకురాలిగా, పార్టీకి విధేయురాలిగా పేరు తెచ్చుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి
10. హైదరాబాద్ నుంచి కొత్తగూడెంకు కొత్త మార్గం
రాజధాని నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుంది. ఈ మార్గం హైదరాబాద్‌లోని గౌరెల్లి (అవుటర్ రింగు రోడ్డు) నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ, వరంగల్ జిల్లా తొర్రూరు, నెహ్రూనగర్ (నర్సంపేట) మీదుగా కొత్తగూడెం వరకు 230 కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్లాలంటే సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం మీదుగా వెళ్లాలి. గౌరెల్లి, వలిగొండ, నర్సంపేట మీదుగా వెళ్లే కొత్త మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి భద్రాచలానికి 35 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Delhi: సాక్షి హంతకుడిని పట్టించిన ఫోన్‌కాల్..!
-
Movies News
Sonu sood: అనాథ పిల్లల కోసం.. సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్
-
India News
PM Modi: ‘నా ప్రతి నిర్ణయం.. మీ కోసమే’: మోదీ
-
Sports News
CSK vs GT: సీఎస్కేకు ఐదో టైటిల్.. ఈ సీజన్లో రికార్డులు ఇవే!
-
Crime News
Kodada: డాక్టర్ రాలేదని కాన్పు చేసిన నర్సులు.. వికటించి శిశువు మృతి
-
Crime News
TSPSC Paper Leak: చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!