Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Jun 2023 09:19 IST

1. ఎస్‌ఎస్‌ఏలో 704 కాంట్రాక్ట్‌ కొలువులు

పాఠశాల విద్యాశాఖలో సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) కింద 704 మంది ఉద్యోగులను కాంట్రాక్ట్‌ విధానంలో నియమించనున్నారు. ఈమేరకు డేటాఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్లు, సిస్టమ్‌ అనలిస్టులు, అసిస్టెంట్‌ ప్రోగ్రామర్లు తదితర పోస్టులను భర్తీ చేసేందుకు 2019 నవంబరులోనే విద్యాశాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించి.. 2020 జనవరిలో జిల్లాలవారీగా మెరిట్‌ ర్యాంకులను ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అన్ని పంచాయతీలను ‘యూపీఐ’ గ్రామాలుగా ప్రకటిస్తాం: కేంద్రం

దేశంలోని అన్ని పంచాయతీలు ఇకపై తమ పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు, పన్నుల వసూళ్లకు డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు ఆగస్టు 15 తర్వాత అన్ని పంచాయతీలను యూపీఐ వినియోగ గ్రామాలుగా ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పురుషులకూ జాతీయ కమిషన్‌!

దేశంలో పురుషుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. పెళ్లైన మగవాళ్లలో బలవన్మరణాలు అధికంగా ఉంటున్నాయని, గృహ హింసే దీనికి ప్రధాన కారణమని న్యాయవాది మహేశ్‌ కుమార్‌ తివారీ తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ కేసు జులై 3న జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా సభ్యులుగా ఉన్న ధర్మాసనం ముందుకు వస్తుందని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జాతి ఆధారంగా అడ్మిషన్లు చెల్లవు

 అమెరికాలోని కళాశాలల్లో జాతి ఆధారంగా ప్రవేశాలు కల్పించడాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అటువంటి విధానం అమెరికా రాజ్యాంగానికి విరుద్ధమని స్పష్టం చేసింది. దీంతో మైనారిటీలుగా ఉండే భారతీయ, ఆసియా విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది. ‘విద్యార్థుల ప్రతిభను వ్యక్తిగతంగా చూడాలి. అంతేగానీ జాతి ఆధారంగా కాదు. చాలా విశ్వవిద్యాలయాలు ఎప్పటి నుంచో ఈ వివక్షను చూపుతున్నాయి. నైపుణ్యాలను అభ్యసించడం, పాఠాలను నేర్చుకోవడం అనేవి జాతిని బట్టి ఉండవు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వైకాపాలో చేరకపోతే.. చంపేస్తాం

వైకాపాలో చేరు, లేదంటే నీ ప్రాణం తీస్తామని ఆ పార్టీ నాయకుడితో పాటు అనుచరులు హెచ్చరిస్తూ.. భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామ సర్పంచి పురుషోత్తం ఆరోపించారు. కార్మికశాఖ మంత్రి సోదరుడు, ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణతో తనకు ప్రాణహాని ఉందని, పోలీసు రక్షణ కల్పించించాలని కోరుతూ సెల్ఫీ వీడియో, మెసేజ్‌ను కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్‌కు పంపినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారీగా ప్రవాసుల కాసులు.. ప్రపంచంలోనే అత్యధికం

గతేడాది ఈ విధంగా వచ్చిన 82 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6.72 లక్షల కోట్ల)తో పోలిస్తే ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8.2 లక్షల కోట్ల)కు చేరే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనాలను ఉటంకించింది. గతేడాది నమోదైన 82     బి.డాలర్లు.. ఇప్పటిదాకా ఏ దేశానికైనా ప్రవాసుల నుంచి వచ్చిన అత్యధిక మొత్తం కావడం గమనార్హం. ‘భారత్‌ మాకు అతిపెద్ద మార్కెట్‌. ముంబయిలో మాకు భారీ స్థాయిలో కార్యకలాపాలున్నాయ’ని ఇన్‌స్టారెమ్‌ గ్లోబల్‌ హెడ్‌ యోగేశ్‌ సంగల్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వాళ్లు ఎక్కువ టెస్టులు ఆడటం క్రికెట్‌ను చంపేస్తుంది

భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు ఎక్కువ టెస్టులు ఆడటం క్రికెట్‌ను చంపేస్తుందని వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ అన్నాడు. ఆటలో కేవలం మూడు జట్లు మాత్రమే ఆధిపత్యం చలాయించడం మంచిది కాదని 43 ఏళ్ల గేల్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘గత కొన్నేళ్లలో క్రికెట్‌ ఎంతో మారిపోయింది. ఇప్పుడది పెద్ద వ్యాపారం. టీ20 లీగ్‌ల్లోనే కాకుండా టెస్టు క్రికెట్లోనూ చాలా డబ్బు వెదజల్లుతున్నారు. చిన్న జట్ల కంటే పెద్ద దేశాలు ఎక్కువ ఆదాయం పొందుతున్నాయి. చిన్న జట్లకు ఇది ప్రతికూలమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమ్మను అలా వదిలి వెళ్లాలంటే భయంగా ఉంది..!

మా అమ్మగారి వయసు 52 ఏళ్లు. మా నాన్నకు, అమ్మకు ఎప్పుడూ గొడవలు అవుతూనే ఉంటాయి. మేము ఇద్దరం అమ్మాయిలం. చదువుకుంటున్నాం. మా కోసమే నాన్నతో కలిసి ఉంటున్నానని అమ్మ ఎప్పుడూ అంటుంటుంది. ఈ మధ్య ఎప్పుడు చూసినా అమ్మ దిగాలుగా, నిరాశగా ఉంటోంది. ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. సరిగా భోజనం కూడా చేయడం లేదు. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. నాన్నకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. అమ్మను ఒంటరిగా వదిలి కాలేజీకి వెళ్లాలంటే ఇద్దరికీ భయంగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తుంగ తాగలేని గంగ

తుంగభద్ర జలాలు గరళంగా మారుతున్నాయి.. 193 పల్లెలు.. 10.74 లక్షల మంది గొంతులు తడుపుతున్న నీరంతా కలుషితమవుతోంది.. ఆ నీటితో కనీసం చేతులు శుభ్రం చేసుకోవడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి.. జల కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరినట్లు కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనాల్లో తేలింది.. నగరంలో మురుగు నేరుగా నదిలోకి వెళ్తోంది.. శుద్ధి కేంద్రాలు నిర్మించాలని కార్పొరేషన్‌ అధికారులకు పలుమార్లు తాఖీదులు జారీ చేసినా స్పందన ఉండటం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ముఖ్యమంత్రి గారూ.. మా బతుకులు బేజారు..

నూతన కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవంతోపాటు పోడు పట్టాల పంపిణీకి వస్తున్న సీఎం కేసీఆర్‌పై జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాగు, తాగునీటి ఇబ్బందులు.. అందని విద్య, వైద్యం, వానొస్తే అడుగు ముందుకు వేయలేని రహదారులు.. ఇలా సకల అసౌకర్యాలతో కునారిల్లుతున్న గిరిజనం.. తమ కష్టాలు తీర్చాలని, నిలిచిపోయిన ప్రాజెక్టులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు తగినన్ని కేటాయింపులు చేసి జిల్లాపై వరాల జల్లు కురిపించాలని జిల్లా ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని