జాతి ఆధారంగా అడ్మిషన్లు చెల్లవు

అమెరికాలోని కళాశాలల్లో జాతి ఆధారంగా ప్రవేశాలు కల్పించడాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అటువంటి విధానం అమెరికా రాజ్యాంగానికి విరుద్ధమని స్పష్టం చేసింది.

Published : 30 Jun 2023 05:13 IST

అమెరికా సుప్రీంకోర్టు స్పష్టీకరణ
భారతీయ విద్యార్థులకు ఊరట

వాషింగ్టన్‌: అమెరికాలోని కళాశాలల్లో జాతి ఆధారంగా ప్రవేశాలు కల్పించడాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అటువంటి విధానం అమెరికా రాజ్యాంగానికి విరుద్ధమని స్పష్టం చేసింది. దీంతో మైనారిటీలుగా ఉండే భారతీయ, ఆసియా విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది. ‘విద్యార్థుల ప్రతిభను వ్యక్తిగతంగా చూడాలి. అంతేగానీ జాతి ఆధారంగా కాదు. చాలా విశ్వవిద్యాలయాలు ఎప్పటి నుంచో ఈ వివక్షను చూపుతున్నాయి. నైపుణ్యాలను అభ్యసించడం, పాఠాలను నేర్చుకోవడం అనేవి జాతిని బట్టి ఉండవు. అది వ్యక్తిగతంగా సంపాదించే గుర్తింపు. శరీర రంగు దానిని ఇవ్వలేదు. రాజ్యాంగ చరిత్ర ఇటువంటి వాటిని క్షమించదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్తులు తీర్పును సమర్థించగా ముగ్గురు వ్యతిరేకించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని