భారీగా ప్రవాసుల కాసులు.. ప్రపంచంలోనే అత్యధికం

భారత్‌లోకి ప్రవాసులు పంపే నగదు (రెమిటెన్స్‌) భారీ స్థాయిలో ఉంటోందని సింగపూర్‌ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్‌స్టారెమ్‌ అంటోంది.

Published : 30 Jun 2023 03:35 IST

2022లో 82 బి.డాలర్లు

సింగపూర్‌: గతేడాది ఈ విధంగా వచ్చిన 82 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6.72 లక్షల కోట్ల)తో పోలిస్తే ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8.2 లక్షల కోట్ల)కు చేరే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనాలను ఉటంకించింది. గతేడాది నమోదైన 82     బి.డాలర్లు.. ఇప్పటిదాకా ఏ దేశానికైనా ప్రవాసుల నుంచి వచ్చిన అత్యధిక మొత్తం కావడం గమనార్హం. ‘భారత్‌ మాకు అతిపెద్ద మార్కెట్‌. ముంబయిలో మాకు భారీ స్థాయిలో కార్యకలాపాలున్నాయ’ని ఇన్‌స్టారెమ్‌ గ్లోబల్‌ హెడ్‌ యోగేశ్‌ సంగల్‌ పేర్కొన్నారు. బెంగళూరు, చెన్నైల్లోనూ ఆఫీసులు తెరచినట్లు తెలిపారు. ‘రెమిటెన్స్‌ మార్కెట్‌లో చాలా కంపెనీలకు అవకాశాలున్నాయి. అగ్రగామి 5 కంపెనీలు 15% మార్కెట్‌ వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి. కాబట్టి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయ’న్నారు. అంతర్జాతీయంగా 682 బిలియన్‌ డాలర్ల రెమిటెన్స్‌ మార్కెట్‌ ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని