వాళ్లు ఎక్కువ టెస్టులు ఆడటం క్రికెట్‌ను చంపేస్తుంది: క్రిస్‌ గేల్‌

భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు ఎక్కువ టెస్టులు ఆడటం క్రికెట్‌ను చంపేస్తుందని వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ అన్నాడు. ఆటలో కేవలం మూడు జట్లు మాత్రమే ఆధిపత్యం చలాయించడం మంచిది కాదని 43 ఏళ్ల గేల్‌ అభిప్రాయపడ్డాడు.

Updated : 30 Jun 2023 09:37 IST

దిల్లీ: భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు ఎక్కువ టెస్టులు ఆడటం క్రికెట్‌ను చంపేస్తుందని వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ అన్నాడు. ఆటలో కేవలం మూడు జట్లు మాత్రమే ఆధిపత్యం చలాయించడం మంచిది కాదని 43 ఏళ్ల గేల్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘గత కొన్నేళ్లలో క్రికెట్‌ ఎంతో మారిపోయింది. ఇప్పుడది పెద్ద వ్యాపారం. టీ20 లీగ్‌ల్లోనే కాకుండా టెస్టు క్రికెట్లోనూ చాలా డబ్బు వెదజల్లుతున్నారు. చిన్న జట్ల కంటే పెద్ద దేశాలు ఎక్కువ ఆదాయం పొందుతున్నాయి. చిన్న జట్లకు ఇది ప్రతికూలమే. నైపుణ్యం పెంచుకోడానికి తక్కువ ర్యాంకు జట్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి. అందరూ ఒకే మొత్తంలో క్రికెట్‌ ఆడుతున్నారు. పెద్ద జట్ల మాదిరే ఈ ఆటగాళ్లకు కూడా మంచి వేతనాలు చెల్లించాలి. కొన్ని బోర్డులు తమ ఆటగాళ్లను ఇతర దేశాల్లో జరిగే లీగ్‌లకు అనుమతించట్లేదు. దీంతో వారి అర్హతకు తగ్గట్లుగా ఆదాయం పొందలేకపోతున్నారు. లీగ్‌ల్లో ఆడేందుకు అనుమతించకుంటే వారికి సరైన వేతనాలు ఇవ్వాలి. అప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌ మెరగవుతుంది. లేదంటే రెండు, మూడు జట్లు టెస్టు, వన్డే క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తాయి. ఇది మంచిది కాదు. ఆటను చంపేస్తుంది’’ అని గేల్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని