అమ్మను అలా వదిలి వెళ్లాలంటే భయంగా ఉంది..!

మా అమ్మగారి వయసు 52 ఏళ్లు. మా నాన్నకు, అమ్మకు ఎప్పుడూ గొడవలు అవుతూనే ఉంటాయి. మేము ఇద్దరం అమ్మాయిలం. చదువుకుంటున్నాం. మా కోసమే నాన్నతో కలిసి ఉంటున్నానని అమ్మ ఎప్పుడూ....

Published : 30 Jun 2023 12:33 IST

మా అమ్మగారి వయసు 52 ఏళ్లు. మా నాన్నకు, అమ్మకు ఎప్పుడూ గొడవలు అవుతూనే ఉంటాయి. మేము ఇద్దరం అమ్మాయిలం. చదువుకుంటున్నాం. మా కోసమే నాన్నతో కలిసి ఉంటున్నానని అమ్మ ఎప్పుడూ అంటుంటుంది. ఈ మధ్య ఎప్పుడు చూసినా అమ్మ దిగాలుగా, నిరాశగా ఉంటోంది. ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. సరిగా భోజనం కూడా చేయడం లేదు. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. నాన్నకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. అమ్మను ఒంటరిగా వదిలి కాలేజీకి వెళ్లాలంటే ఇద్దరికీ భయంగా ఉంది. మమ్మల్ని పట్టించుకునే దగ్గరి బంధువులు కూడా లేరు. అమ్మ ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు చెబుతోన్న విషయాలను బట్టి మీ తల్లిదండ్రులకు మొదటి నుంచి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నట్టుగా అర్థమవుతోంది. మీ అమ్మ గారు సరిగా ఆహారం తీసుకోకపోవడం, బయటకు రాకపోవడం, ఇతరులతో ఎక్కువగా మాట్లాడకపోవడం వంటివి చేస్తున్నారని అంటున్నారు. ఇవన్నీ డిప్రెషన్‌కి సంబంధించిన లక్షణాలే. అంటే మీ అమ్మగారు నెమ్మదిగా డిప్రెషన్‌లోకి వెళుతున్నారని అర్థమవుతోంది. కాబట్టి, సాధ్యమైనంత త్వరగా తనని తీసుకుని మానసిక నిపుణులను సంప్రదించండి. వారు తగిన చికిత్స అందిస్తారు. ఇది భార్యాభర్తలిద్దరి సమస్య కాబట్టి ఇద్దరూ మానసిక నిపుణులను/ ఫ్యామిలీ కౌన్సెలర్లను కలవాల్సి ఉంటుంది. వారు ఇద్దరినీ ప్రశ్నించి అసలు సమస్య ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత తగిన సలహా/చికిత్స అందిస్తారు. కాబట్టి, నిరాశపడకండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని