Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Mar 2024 09:14 IST

1. సభకు హాజరులో తెదేపా ఎంపీలదే అగ్రస్థానం

లోక్‌సభకు హాజరుకావడంలో తెదేపా ఎంపీలు దేశంలోని మిగతా అన్ని పార్టీల ఎంపీల కంటే ముందు వరుసలో ఉన్నారు. 17వ లోక్‌సభ 273 రోజులు నడవగా తెదేపా ఎంపీలు సగటున 229 రోజులు సభకు హాజరై అన్ని పార్టీల కంటే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎంపీలు 12 (సగటున 185 రోజుల హాజరుతో), తెరాస ఎంపీలు 13 (సగటున 181 రోజులు)వ స్థానాల్లో ఉన్నారు. పూర్తి కథనం

2. అంతుచిక్కని అల్లోల అంతరంగం

రెండు, మూడు రోజులు ఆగండి.. సార్‌, కాంగ్రెస్‌ పెద్దోళ్లతో మాట్లాడుతున్నారు.. ఆయనతోనే కలిసి ఆ పార్టీలో చేరుదాం.. తొందరపడి ఎటూ వెళ్లకండి అంటూ భారాసకు చెందిన ఇద్దరు సీనియర్‌ నేతలు పక్షం రోజులుగా ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులకు బుజ్జగిస్తూ వస్తున్నారు. ఆ మాటలు నమ్మిన కొందరు వేచి చూస్తుండగా.. మరికొందరు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు.పూర్తి కథనం

3. తెలంగాణలో భేష్‌.. ఏపీలో తుస్‌!

ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మాత్రం మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఈ విషయంలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ దూసుకెళ్తుంటే.. జగన్‌ పాలనా వైఫల్యంతో ఆంధ్ర వెనకబడిపోయింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతోపాటు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవల్లోనూ తెలంగాణ పకడ్బందీ ప్రణాళికలతో ముందుంది.పూర్తి కథనం

4. నా ఫోన్‌నూ ట్యాప్‌ చేశారు

గత భారాస ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్‌ చేయించిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న హైదరాబాద్‌లో పాతబస్తీ అలియాబాద్‌కు చెందిన భాజపా సీనియర్‌ నేత పొన్న సుదర్శన్‌ను ఆయన మంగళవారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో, కరీంనగర్‌లో మంగళవారం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ మండలాల ఇన్‌ఛార్జులతో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ సంజయ్‌ మాట్లాడారు.పూర్తి కథనం

5. సీజ్‌ చేసిన కంటెయినర్‌ ఇంకొన్ని రోజులు అక్కడే!

విశాఖ పోర్టుకు ఈస్ట్‌ మాటున డ్రగ్స్‌ దిగుమతి కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బ్రెజిల్‌ నుంచి ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌ను దిగుమతి చేసుకోగా, అందులో నిషేధిత మాదకద్రవ్యాల అవశేషాలు ఉన్నట్లు సీబీఐ పరీక్షల్లో నిర్ధారించిన విషయం తెలిసిందే. ఎంత మొత్తంలో డ్రగ్స్‌ కలిశాయో తెలుసుకునేందుకు నమూనాలను సీఎఫ్‌ఎస్‌ఎల్‌ (సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌)కి పంపారు.పూర్తి కథనం

6. అచ్చొచ్చిన చోటే ఆరంభం

గత ఎన్నికల్లో అచ్చొచ్చిన ప్రాంతం నుంచే భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు భారీ బహిరంగ సభను నిర్వహించి ఇక్కడే పార్టీ అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఈసారి కూడా ఇక్కడే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని పార్టీ అగ్రనేతలు యోచిస్తున్నారు.పూర్తి కథనం

7. ఎస్‌డీ కార్డులేవి జగనన్నా?

సాంకేతిక విద్యపై అవగాహన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లతో లక్ష్యం నెరవేరడం లేదు. ఎస్‌డీ కార్డులు సరఫరా చేయకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఇంటి వద్ద వేరే సిమ్‌లు అమర్చుకుని వీడియో గేమ్‌లు ఆడటం, సినిమాలు, రీల్స్‌ వంటివి చూస్తున్నారని సమాచారం.పూర్తి కథనం

8. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తూనే తొలిరోజు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామని, 60 రోజుల్లోనే పరీక్ష నిర్వహిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు చరిత్రలో లేనివిధంగా 1.50 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చిన ఘనత తమకు ఉందన్నారు. ఇప్పుడూ అలాగే చరిత్ర సృష్టిస్తామని, ఎన్ని పోస్టులుంటే అన్నీ భర్తీ చేస్తామన్నారు.పూర్తి కథనం

9. గాజా వివాదంపై అమెరికా తీరుకు నిరసన.. పీహెచ్‌డీ డిగ్రీనీ వెనక్కి ఇచ్చేసిన సందీప్‌పాండే

దాదాపు ఆర్నెల్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ - పాలస్తీనా యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గత జనవరిలో రామన్‌ మెగసెసె అవార్డు వదులుకొంటున్నట్లు ప్రకటించిన సామాజిక ఉద్యమకారుడు సందీప్‌పాండే బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి తాను చేసిన పీహెచ్‌డీ డిగ్రీని సైతం తాజాగా వెనక్కు ఇచ్చేశారు.పూర్తి కథనం

10. యాగ్జిలరీ పదోన్నతులపై ఆరా

పోలీసు శాఖలో ప్రణీత్‌రావు వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయన మాదిరిగానే యాగ్జిలరీ పదోన్నతులు పొందిన వారి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో ప్రణీత్‌రావు పేరు వెలుగులోకి రాగా.. అదే సమయంలో ఆయన యాగ్జిలరీ పదోన్నతి అంశం కూడా బయటకు పొక్కింది. ఆయనతోపాటు మరికొందరికీ ఇలానే పదోన్నతులు ఇచ్చిన విషయం వెలుగుచూడటం చర్చనీయాంశంగా మారింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని