logo

ఎస్‌డీ కార్డులేవి జగనన్నా?

సాంకేతిక విద్యపై అవగాహన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లతో లక్ష్యం నెరవేరడం లేదు.

Updated : 27 Mar 2024 05:12 IST

ట్యాబ్‌లతో సరిపెట్టిన అధికారులు
మూడు నెలలుగా విద్యార్థుల ఎదురుచూపులు
న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం  

సాంకేతిక విద్యపై అవగాహన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లతో లక్ష్యం నెరవేరడం లేదు. ఎస్‌డీ కార్డులు సరఫరా చేయకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఇంటి వద్ద వేరే సిమ్‌లు అమర్చుకుని వీడియో గేమ్‌లు ఆడటం, సినిమాలు, రీల్స్‌ వంటివి చూస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో పిల్లలు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.

జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు 22,150 ట్యాబ్‌లు పంపిణీ చేశారు. మూడు నెలలు గడిచినా ఎస్‌డీ కార్డులు పంపిణీ చేయలేదు. క్యూఆర్‌ కోడ్‌ ఆన్‌లైన్‌లో డౌన్లోడ్‌ చేసుకుని కంటెంట్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ఉన్నతాధికారులు ఉపాధ్యాయులను ఆదేశించారు. ఎస్‌డీ కార్డు ఉంటేనే అది సాధ్యమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ట్యాబ్‌లు, పౌచ్‌లు మాత్రమే అందించడంతో ఇళ్ల వద్ద వృథాగా ఉన్నాయి. ఈ విషయమై డీఈవో వెంకటేశ్వరరావును ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా ఎస్‌డీ కార్డులు రాగానే విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు.


ఒకేసారి పంపిణీ..

జిల్లాకు 20 వేల వరకు ఎస్‌డీ కార్డులు రావాలి. అవి వచ్చిన తరువాత అందరికీ ఒకేసారి పంపిణీ చేస్తాం.

జగదీష్‌, సమన్వయకర్త, బైజూస్‌, శ్రీకాకుళం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని