Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Jul 2023 09:05 IST

1. ఏం తమాషాగా ఉందా... ఏమనుకుంటున్నావ్‌?.. ఎమ్మెల్యే సమక్షంలోనే వైకాపా నేత బెదిరింపులు

‘అసలు నీవు ఏమనుకుంటున్నావ్‌. ఏం తమాషాగా ఉందా?. ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. మండలం నుంచి ఎక్కడైనా వెళ్లిపో. మా వాళ్లు ఏమడిగినా చేయలేమని అంటున్నావ్‌. ఎందుకంత బలుపు’ అంటూ ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె రైతు భరోసా కేంద్రం బాధ్యురాలు (గ్రామ ఉద్యాన సహాయకురాలు) పుష్పరాణి పట్ల ఓ కీలక నేత ముఖ్య అనుచరుడిగా అంతా తానై చెలామణి అవుతున్న ఓ నాయకుడు అనుచితంగా మాట్లాడారు. గ్రామంలో శనివారం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రోబోల సాయంతో పేలుళ్ల కుట్ర?

ఐసిస్‌ సహకారంతో దేశ వ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడేందుకు కుట్ర రూపొందించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులపై జాతీయ తనిఖీ దళం (ఎన్‌ఐఏ) అదనపు అభియోగపత్రాన్ని న్యాయస్థానంలో దాఖలు చేసింది. ఆ కుట్ర కేసులో మహ్మద్‌ షరీఖ్‌ (25), మాజ్‌ మునీర్‌ అహ్మద్‌ (23), సయ్యద్‌ యాసిన్‌ (22), రీషాన్‌ తాజుద్దీన్‌ షేక్‌ (22), హుజైర్‌ ఫర్హాన్‌ బేగ్‌ (22), మాజిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌ (22), కేఏ నదీం అహ్మద్‌ (22) జబీవుల్లా (32), ఎన్‌.నదీమ్‌ ఫాజిల్‌ (27) అనే వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రత్న భాండాగారం... చర్చనీయాంశం

పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. విపక్ష నేతలు, మేధావులు, సేవాయత్‌లు, పూరీ రాజు దివ్యసింగ్‌దేవ్‌ ఈ భాండాగారం తెరిచి మరమ్మతులు చేయాలని, అందులోని స్వామి ఆభరణాలను సంరక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదు. పాలకులు ఈ విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు అన్న విమర్శలు ముమ్మరమయ్యాయి. దీనిపై భాజపా నేతలు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చేపల వేట.. చెరువుకే చేటంట

చేపల వేట కోసం ఏకంగా చెరువుకే చేటు తెచ్చిన వైనమిది. సంతనూతలపాడు మండలం ఎనికపాడులో మంచినీటి చెరువు పక్కన సుమారు 32 ఎకరాల్లో మరొకటి ఉంది. ఇందులో కొద్దిరోజుల క్రితం వరకు పుష్కలంగా నీరుండేది. చేపల పెంపకందారులు ఇటీవల వాటిని పట్టించేందుకు నిర్ణయించారు. దీంతో తూముల నుంచి బయటకు వదిలారు. ఇంకా 40 శాతం వరకు నీరు చెరువులో ఉండిపోయింది. చేపలు పట్టేందుకు వీలుపడదంటూ ఈ నీటిని బయటకు పంపేందుకు సిద్ధపడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేకులు.. కేకలు.. జనాలకు చుక్కలు

ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చిన్నపాటి నిరసన ప్రదర్శన చేపట్టేందుకు కూడా అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకుంటుంటారు. అటువంటిది అధికార పార్టీ సర్పంచి నిర్వాకానికి జనం మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పడినప్పటికీ మిన్నకుండిపోయారు. ఈ ఉదంతం దర్శిలో శనివారం చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకల పేరుతో జముకులదిన్నె వైకాపా సర్పంచి మర్రి సత్యనారాయణ పట్టణంలో హడావుడి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మామయ్యా.. నీళ్లూ లేవయ్యా!

ముఖ్యమంత్రి జగన్‌ మామయ్యా.. ఈ చిత్రాల్లో కనిపిస్తున్న మేమంతా కనిగిరిలోని కళాశాల బీసీ బాలికల ప్రభుత్వ వసతి గృహం విద్యార్థినులం. ఉమ్మడి ప్రకాశంలోని చీరాల, అద్దంకి, దర్శి, కనిగిరి ప్రాంతాల నుంచి వచ్చి పట్టణంలోని వివిధ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ విద్య అభ్యసిస్తున్నాం. వసతి గృహానికి సొంత భవనం లేకపోవడంతో కొత్తపేటలోని ఓ ప్రైవేట్‌ గృహాన్ని అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. మొత్తం 46 మంది బాలికలం ఉన్నప్పటికీ ఇక్కడ బోరు పని చేయడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కలలోనే కిలోల కొనుగోలు

మార్కెట్‌కు వెళ్లిన వారు కూరగాయల ధరలు విని బెంబేలెత్తుతున్నారు. టమాటా, పచ్చిమిర్చి వంటింట్లో నిత్యావసరాలుగా మారాయి. గత పది రోజులుగా ఇవి కొండెక్కి కూర్చున్నాయి. ధరలు వింటుంటేనే వండకుండానే ఇళ్లలో వణుకు పుడుతోంది. కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లిన కొందరు కొనుగోలు చేయలేక వెనుదిరుగుతుండగా.. మరికొందరు విధి లేని పరిస్థితుల్లో కిలోలకు బదులు పావులతో నెట్టుకొస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బంధువులే సిబ్బందిగా మారి..

ఇలా స్ట్రెచర్‌పై ఓ వృద్ధురాలిని సొంత బంధువులే వైద్యుల దగ్గరకు తీసుకెళ్తున్న దృశ్యం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. మెరుగైన వైద్యంతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నామని  పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వైద్యాధికారులు నిర్లక్ష్యంతో ఇక్కడుకు వచ్చే రోగులకు వారి బంధువులకు అవస్థలు తప్పటం లేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమ్మా.. నా ప్రాణం నీ చేతిలోనే..

శిశు మరణాలు లేకుండా చేయాలన్నది వైద్య ఆరోగ్య శాఖ నినాదం. కానీ పసికందులు గర్భంలో, పుట్టిన గంటల వ్యవధిలో, వారం, రెండు వారాల్లో వివిధ కారణాలు, అనారోగ్యంతో ఊపిరి వదిలేస్తున్నారు. బాల్య వివాహాలు, పౌష్టికాహార లోపం, గర్భిణులకు అవగాహన లేకపోవడం.. ప్రసవం సమయంలో క్షేత్రస్థాయిలో సరైన వైద్య సేవలు అందకపోవడం శిశు మరణాలకు ప్రధాన కారణాలని ప్రాథమికంగా నిర్ధారించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కోనసీమ ఆప్యాయత మరువలేనిది: సినీనటుడు విష్వక్‌సేన్‌

కోనసీమలోని ఆప్యాయత, అనురాగాలు మరువలేనివని.. ఇక్కడ అందాలు కళ్లను కట్టిపడేస్తున్నాయని సినీనటుడు విష్వక్‌సేన్‌ అన్నారు. గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే కథా చిత్రంలో నటిస్తున్నానని, నలభై రోజులుగా చిత్రీకరణ జరుగుతుందని తెలిపారు. తన కెరీర్‌లో చోటుచేసుకున్న పలు విషయాలను వెల్లడించారు. అమలాపురం మండలం పేరూరులో ఓ సినిమా చిత్రీకరణ కోసం వచ్చిన విష్వక్‌సేన్‌ విలేకర్లతో శనివారం కాసేపు ముచ్చటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని