logo

మామయ్యా.. నీళ్లూ లేవయ్యా!

ముఖ్యమంత్రి జగన్‌ మామయ్యా.. ఈ చిత్రాల్లో కనిపిస్తున్న మేమంతా కనిగిరిలోని కళాశాల బీసీ బాలికల ప్రభుత్వ వసతి గృహం విద్యార్థినులం.

Published : 02 Jul 2023 02:09 IST

ఖాళీ బకెట్లతో నీటి కోసం వెళ్తున్న బాలికలు

ముఖ్యమంత్రి జగన్‌ మామయ్యా.. ఈ చిత్రాల్లో కనిపిస్తున్న మేమంతా కనిగిరిలోని కళాశాల బీసీ బాలికల ప్రభుత్వ వసతి గృహం విద్యార్థినులం. ఉమ్మడి ప్రకాశంలోని చీరాల, అద్దంకి, దర్శి, కనిగిరి ప్రాంతాల నుంచి వచ్చి పట్టణంలోని వివిధ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ విద్య అభ్యసిస్తున్నాం. వసతి గృహానికి సొంత భవనం లేకపోవడంతో కొత్తపేటలోని ఓ ప్రైవేట్‌ గృహాన్ని అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. మొత్తం 46 మంది బాలికలం ఉన్నప్పటికీ ఇక్కడ బోరు పని చేయడం లేదు. విషయాన్ని ఎన్నోసార్లు పలువురికి విన్నవించాం. అయినా పట్టించుకున్నవారు లేకపోయారు. కనీస అవసరాలు తీర్చుకునేందుకు, స్నానాలకు బకెట్లు.. బిందెలతో ఇరుగు పొరుగు ఇళ్లకు పరుగులు తీయాల్సి వస్తోంది. దయతో వాళ్లు కొన్నిసార్లు పట్టుకోమంటున్నారు. మరికొన్నిసార్లు విసుక్కుంటున్నారు. వేళలకు కళాశాలలకు వెళ్లాలంటే వేకువజాము 4 గంటల నుంచే మాకు నీటి వేట తప్పడం లేదు. బక్కెట్లు, బిందెలు చేతబట్టి చీకట్లలోనే ఎక్కడ చేతిపంపులున్నాయా అని తిరగాల్సి వస్తోంది. జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించి నీటి వసతి అయినా కల్పించేలా చూడండి.. లేదంటే వేరే చోటికి అయినా మార్పించండి.

న్యూస్‌టుడే, కనిగిరి

ఇట్లు: బీసీ బాలికల వసతి గృహం విద్యార్థినులు.

వసతి గృహం సమీపంలోని ఓ ఇంటి వద్ద పట్టుకుంటూ...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని