logo

బంధువులే సిబ్బందిగా మారి..

ఇలా స్ట్రెచర్‌పై ఓ వృద్ధురాలిని సొంత బంధువులే వైద్యుల దగ్గరకు తీసుకెళ్తున్న దృశ్యం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది.

Published : 02 Jul 2023 05:07 IST

ఇలా స్ట్రెచర్‌పై ఓ వృద్ధురాలిని సొంత బంధువులే వైద్యుల దగ్గరకు తీసుకెళ్తున్న దృశ్యం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. మెరుగైన వైద్యంతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నామని  పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వైద్యాధికారులు నిర్లక్ష్యంతో ఇక్కడుకు వచ్చే రోగులకు వారి బంధువులకు అవస్థలు తప్పటం లేదు.

న్యూస్‌టుడే, నెల్లూరు (జీజీహెచ్‌)


బడిలో బావి ప్రమాదాల దరి

ఈ చిత్రంలో కనిపిస్తున్న బావి.. పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోనిది. బావి ఉపరితలంపై ఎటువంటి గ్రిల్స్‌ లేకపోవడంతో పిల్లలు ఆడుకునే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనిపై పటిష్ఠమైన గ్రిల్‌ వంటివి ఏర్పాటు చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు
కోరుతున్నారు.

న్యూస్‌టుడే, కావలి


మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం

మొక్కలు నాటడానికి ఇస్తున్న ప్రాధాన్యం సంరక్షణకు ఇవ్వటంలేదు. జగనన్నా పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా కోవూరు పట్టణ పరిధి సాలుచింతలు వద్ద ముంబయి జాతీయ రహదారి పక్కన ఇటీవల నాటిన పచ్చని మొక్కలపై పర్యవేక్షణ కరవైంది. రోడ్డు పక్కన మార్జిన్‌లో లారీలు, టిప్పర్లు నిలుపుతున్నారు. మొక్కలకు వాహనాలు తగులుతుండటంతో అవి క్రమంగా విరిగిపోతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో మొక్కల పెంపకం మూణ్నాళ్ల ముచ్చటగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు.

న్యూస్‌టుడే కోవూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని