logo

Puri Temple: రత్న భాండాగారం... చర్చనీయాంశం

పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. విపక్ష నేతలు, మేధావులు, సేవాయత్‌లు, పూరీ రాజు దివ్యసింగ్‌దేవ్‌ ఈ భాండాగారం తెరిచి మరమ్మతులు చేయాలని, అందులోని స్వామి ఆభరణాలను సంరక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated : 02 Jul 2023 08:54 IST

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. విపక్ష నేతలు, మేధావులు, సేవాయత్‌లు, పూరీ రాజు దివ్యసింగ్‌దేవ్‌ ఈ భాండాగారం తెరిచి మరమ్మతులు చేయాలని, అందులోని స్వామి ఆభరణాలను సంరక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదు. పాలకులు ఈ విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు అన్న విమర్శలు ముమ్మరమయ్యాయి. దీనిపై భాజపా నేతలు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి.  


అందరూ ఓపిక పట్టాలి

భాండాగారం తాళం చెవి ఉందా పోయిందా అనే విషయం నాకు తెలియదు. దీనిపై హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది. కేసు విచారణ పూర్తయ్యాక న్యాయస్థానం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు అందరూ ఓపిక పట్టాలి. ప్రభుత్వం పురాతన ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ముమ్మర చర్యలు తీసుకుంటోంది. పూరీ జగన్నాథ ఆలయం చుట్టూ పరిక్రమణ మార్గం పనులు ముగించేందుకు దృష్టి సారిస్తోంది. రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

జగన్నాథ్‌ సరక, న్యాయశాఖ మంత్రి


కమిటీ ఏర్పాటు చేయాలి

రత్న భాండాగారం తెరిచి మరమ్మతులు చేయించాలని పూరీ గజపతి దివ్యసింగ్‌దేవ్‌, ఆలయ ప్రధాన సేవాయత్‌లు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. సిట్టింగ్‌ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి భాండాగారం తెరిచి ఆభరణాలు లెక్కించాలి.

సమీర్‌ మహంతి, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు


ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?

ఇటీవల భాండాగారం తాళం చెవి పోయిందని ప్రభుత్వం ప్రచారం చేసి భాండాగారం తెరవకుండా దాటవేసింది. ప్రభుత్వం ఎందుకు తెరిచేందుకు భయపడుతోంది. దీనివల్ల ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

నర్సింగ్‌ మిశ్రా, కాంగ్రెస్‌ శాసనసభా పక్షం నేత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు