logo

Bengaluru: రోబోల సాయంతో పేలుళ్ల కుట్ర?

: ఐసిస్‌ సహకారంతో దేశ వ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడేందుకు కుట్ర రూపొందించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులపై జాతీయ తనిఖీ దళం (ఎన్‌ఐఏ) అదనపు అభియోగపత్రాన్ని న్యాయస్థానంలో దాఖలు చేసింది.

Updated : 02 Jul 2023 08:43 IST

అనుమానితులపై అభియోగపత్రం

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ఐసిస్‌ సహకారంతో దేశ వ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడేందుకు కుట్ర రూపొందించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులపై జాతీయ తనిఖీ దళం (ఎన్‌ఐఏ) అదనపు అభియోగపత్రాన్ని న్యాయస్థానంలో దాఖలు చేసింది. ఆ కుట్ర కేసులో మహ్మద్‌ షరీఖ్‌ (25), మాజ్‌ మునీర్‌ అహ్మద్‌ (23), సయ్యద్‌ యాసిన్‌ (22), రీషాన్‌ తాజుద్దీన్‌ షేక్‌ (22), హుజైర్‌ ఫర్హాన్‌ బేగ్‌ (22), మాజిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌ (22), కేఏ నదీం అహ్మద్‌ (22) జబీవుల్లా (32), ఎన్‌.నదీమ్‌ ఫాజిల్‌ (27) అనే వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. రీషాన్‌ తాజుద్దీన్‌ షేక్‌, మాజిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌, కేఏ నదీం అహ్మద్‌ అనే వారు మెకానికల్‌, ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేయగా మరో ఇద్దరికి సాంకేతిక విద్యానేపథ్యం ఉందని గుర్తించారు. దాన్ని ఉపయోగించుకుని రోబోట్లు, డ్రోన్‌ల సాయంతో దాడులకు ప్రణాళికలను రూపొందించారని ఎన్‌ఐఏ తన అదనపు అభియోగపత్రంలో పేర్కొంది. భద్రా నదీ తీరంలో తాము తయారు చేసిన బాంబును పేల్చారని ఇప్పటికే ఒక అభియోగపత్రంలో ఎన్‌ఐఏ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు