Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Jul 2023 09:10 IST

1. తిండి గింజకు యుద్ధం తిప్పలు!

రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య 500 రోజులుగా యుద్ధం నడుస్తున్నా ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో చాలామంది ప్రజల నోటిలోకి రోజూ కాసింత ముద్ద పోతోందంటే, ఆ దేశాలకు తిండి గింజలు దొరుకుతున్నాయంటే కారణం నల్ల సముద్ర ధాన్య ఒప్పందం(బ్లాక్‌సీ గ్రెయిన్‌ డీల్‌)! దీన్నుంచి సోమవారం రష్యా అనూహ్యంగా దూరమవ్వాలని నిర్ణయించడం ఆందోళనకు గురిచేసే పరిణామమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వచ్చే నెలలో విశాఖకు రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చే నెలలో విశాఖ ఉక్కు కర్మాగారానికి రానున్నారని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాకేశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం విశాఖ నగరానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తుందని జోడో యాత్ర సమయంలో రాహుల్‌గాంధీ పేర్కొన్నారని చెప్పారు. అందులో భాగంగానే ఇక్కడకు వచ్చి ఉక్కు పరిరక్షణ కోసం దీక్ష చేపట్టిన వారికి మద్దతుగా మాట్లాడతారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అంతరిస్తున్న కళ.. కోట్ల వ్యాపారమైంది!

ఓటమికి భయపడితే... ఆటైనా, జీవితమైనా అక్కడే ఆగిపోతుంది...  విజయం కావాలంటే గమనం మార్చుకోవాల్సిందే... అంటారు యోషా. నోట్ల రద్దుతో వ్యాపారం మూసేయాల్సి వస్తే... ఆదరణ కోల్పోతున్న కళలకు పునరుజ్జీవం కల్పించడానికి మరోదాన్ని ఎంచుకుని సాగిపోతున్నారు. తాను ఉపాధి పొందడమేకాదు... వందల మందికి స్థిర ఆదాయం కల్పిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇంటర్‌తో చక్కని అవకాశాలెన్నో సిస్టర్‌!

మేటి ఉపాధి అవకాశాలు అందించే కోర్సుల్లో నర్సింగ్‌ విద్య ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా నర్సుల కొరత ఉంది. అందువల్ల కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగానికి ఢోకా లేదు. కార్పొరేట్‌, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీరికి ఆకర్షణీయ  వేతనాలూ దక్కుతున్నాయి. బీఎస్సీ నర్సింగ్‌తో కేంద్ర ఆసుపత్రుల్లో అవకాశం వచ్చినవారు మొదటి నెల నుంచే రూ.80 వేల వేతనం అందుకోవచ్చు. ఇంటర్మీడియట్‌ గ్రూపు ప్రకారం.. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో చేరవచ్చు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎవరిదో హస్తవాసి!

ఓరుగల్లు రాజకీయ ముఖచిత్రంలోని పార్టీల్లో రగడ రోజురోజుకు పెరుగుతోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఊపు మీదున్న హస్తం పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువైంది. డజను నియోజకవర్గాల్లో తాజా సమీకరణాలను పరిశీలిస్తే కాంగ్రెస్‌ టికెట్‌ కోసం కొన్ని చోట్ల ఇద్దరేసి పోటీ పడుతుండగా మరికొన్ని చోట్ల త్రిముఖ పోరు తప్పేలా లేదు. బలమైన అభ్యర్థులు లేని చోట్లా అధికార భారాసకు దీటుగా అంగ, ఆర్థిక బలాలున్న అభ్యర్థులు రంగంలోకి దిగడానికి పావులు కదుపుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పాత విధానంలోనే ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఈ ఏడాది పాత విధానంలోనే కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) స్పష్టతను ఇచ్చింది. 2023-24 విద్యాసంవత్సరానికి నీట్‌-యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాత రాష్ట్రాల వైద్య విశ్వవిద్యాలయాలు మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రెండోసారి చంద్రయాన్‌-3 కక్ష్య పెంపు

జాబిల్లిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-3.. క్రమంగా చందమామ దిశగా అడుగులు వేస్తోంది. సోమవారం శాస్త్రవేత్తలు.. ఈ వ్యోమనౌకలోని ఇంజిన్‌ను మండించి రెండోసారి కక్ష్యను పెంచారు. దీంతో చంద్రయాన్‌-3 41,603 ్ల 226 కిలోమీటర్ల కక్ష్యలోకి చేరింది. ఈ కసరత్తు మళ్లీ మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య జరుగుతుందని ఇస్రో ప్రకటించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పథకాలు అందకపోయినా వేయాల్సిందే.. ఒత్తిడి తెస్తున్న వాలంటీర్లు

మాకు ప్రభుత్వ పథకం ఒక్కటీ అందడం లేదు. ఎటువంటి ధ్రువీకరణ పత్రమూ కోరుకోవడం లేదు. అయినా బయోమెట్రిక్‌ వేయాలని, ఫొటో తీసుకుంటామని ఎందుకు అడుగుతున్నారు. ఒక వేళ అది దుర్వినియోగమైతే ఎవరు బాధ్యత వహిస్తారు’ ఇటీవల చినముషిడివాడలో స్థానికుల నుంచి వాలంటీర్లకు ఎదురైన ప్రశ్న ఇది? ఎటువంటి లబ్ధి చేకూరకపోయినా బయోమెట్రిక్‌ తీసుకోవాలని పైస్థాయి నుంచి ఆదేశాలు, ఒత్తిళ్లు ఉన్నాయని వాలంటీర్లు చెబుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కట్టేసుకోండి..కళ్లప్పగిస్తాం!

‘ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే శిక్షార్హులంటూ’ తెదేపా గన్నవరం మండలాధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావుకు వారసత్వంగా 50 ఏళ్ల నుంచి వచ్చిన భూమిలో నిర్మించిన దుకాణ సముదాయాన్ని.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంటలో మాదల శ్రీనివాసరావుకు చెందిన ఎరువుల గోదాం, షెడ్‌ను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు.. విమానాశ్రయం అభిముఖంగా దుర్గాపురంలో రూ.కోట్ల విలువైన భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలి. కబ్జాదారులకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? దీనిపై కింది స్థాయి కోర్టును ఆశ్రయించినా న్యాయం జరగలేదు. త్వరలో హైకోర్టులో పిటిషన్‌ వేయనున్నాం.’పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కంప్యూటర్‌ కోర్సులపైనే మోజు

ఇంజినీరింగ్‌ మొదటి విడత ప్రవేశాల్లో   ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో విద్యార్థులు సీఎస్‌ఈ(కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌), అనుబంధ కోర్సులకు అధిక ప్రాధాన్యమిచ్చారు. సీఎస్‌ఈ బ్రాంచికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి దాని అనుబంధ కోర్సులకు రెండో ప్రాధాన్యమివ్వటం విశేషం. 80 నుంచి 90 శాతం మంది విద్యార్థులు ఈ కోర్సులనే ఎంచుకున్నారు. సీఎస్‌ఈ అనుబంధ కోర్సులైన ఏఐఎంఅండ్‌ఎల్‌(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌), సీఎస్‌ఎం, సీఎస్‌డీ(కంప్యూటర్‌ సైన్స్‌ డిజైన్‌), ఏఐడీ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌) వైపు ఆసక్తి చూపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని