రెండోసారి చంద్రయాన్‌-3 కక్ష్య పెంపు

జాబిల్లిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-3.. క్రమంగా చందమామ దిశగా అడుగులు వేస్తోంది.

Published : 18 Jul 2023 05:02 IST

బెంగళూరు: జాబిల్లిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-3.. క్రమంగా చందమామ దిశగా అడుగులు వేస్తోంది. సోమవారం శాస్త్రవేత్తలు.. ఈ వ్యోమనౌకలోని ఇంజిన్‌ను మండించి రెండోసారి కక్ష్యను పెంచారు. దీంతో చంద్రయాన్‌-3 41,603 ్ల 226 కిలోమీటర్ల కక్ష్యలోకి చేరింది. ఈ కసరత్తు మళ్లీ మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య జరుగుతుందని ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్‌-3 గమనం సజావుగా సాగుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యోమనౌకను శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. శనివారం తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఈ ప్రక్రియను దశలవారీగా కొనసాగిస్తూ చంద్రయాన్‌-3 జాబిల్లికి చేరువచేస్తారు. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని