logo

కంప్యూటర్‌ కోర్సులపైనే మోజు

ఇంజినీరింగ్‌ మొదటి విడత ప్రవేశాల్లో   ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో విద్యార్థులు సీఎస్‌ఈ(కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌), అనుబంధ కోర్సులకు అధిక ప్రాధాన్యమిచ్చారు.

Published : 18 Jul 2023 05:51 IST

ఖమ్మం గాంధీచౌక్‌, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ మొదటి విడత ప్రవేశాల్లో   ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో విద్యార్థులు సీఎస్‌ఈ(కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌), అనుబంధ కోర్సులకు అధిక ప్రాధాన్యమిచ్చారు. సీఎస్‌ఈ బ్రాంచికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి దాని అనుబంధ కోర్సులకు రెండో ప్రాధాన్యమివ్వటం విశేషం. 80 నుంచి 90 శాతం మంది విద్యార్థులు ఈ కోర్సులనే ఎంచుకున్నారు. సీఎస్‌ఈ     అనుబంధ కోర్సులైన ఏఐఎంఅండ్‌ఎల్‌(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌), సీఎస్‌ఎం, సీఎస్‌డీ(కంప్యూటర్‌ సైన్స్‌ డిజైన్‌), ఏఐడీ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌) వైపు ఆసక్తి చూపారు. సర్క్యూట్‌ బ్రాంచిల్లో సీఎస్‌ఈ తర్వాత ఈసీఈ(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌) బ్రాంచి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఈఈఈ(ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌) బ్రాంచి పరిస్థితి నామమాత్రం. నాన్‌ సర్క్యూట్‌ బ్రాంచిల్లో సివిల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పరిస్థితి బాగోలేదు. కోర్‌ బ్రాంచిలకు నానాటికీ ఆదరణ తగ్గుతోంది.

61 శాతం సీట్లు భర్తీ

ఖమ్మం జిల్లాలో ఏడు, భద్రాద్రిలో ఐదు   ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో  3,273 సీట్లు ఉండగా మొదటి విడత  కౌన్సెలింగ్‌లో 2,008 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 1,265 సీట్లు మిగిలి ఉన్నాయి. 61 శాతం మంది విద్యార్థులు మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే తమకు ఇష్టమైన బ్రాంచిలను ఎంచుకున్నారు.

24 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌...

ఈ నెల 24 నుంచి ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. 27 వరకు ఆప్షన్లు పెట్టుకోవాలి. 31 వరకు అలాట్‌మెంట్‌ ఉంటుంది. ఆగస్టు 2న కళాశాలల్లో రిపోర్టు చేయాలి. తుది విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 4 నుంచి 6 వరకు ఉంటుంది. అలాట్‌మెంట్‌ 9 వరకు, 11న రిపోర్టు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని