Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Jul 2023 09:21 IST

1. పండు కొనలేం.. కూర వండలేం

ఎడతెరిపిలేకుండా వర్షాలు.. వరదలతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌ పంటలు ప్రారంభ దశలో కురిసిన భారీ వర్షాలు ఇటు కూరగాయల పంటను, పండ్ల తోటలను దెబ్బతీశాయి. ఉత్తర భారతం.. దక్షిణ భారతం అనే తేడా లేకుండా వరదలు ముంచెత్తడంతో పంటలు కొట్టుకుపోయాయి. ఉత్తరాదిన ఆపిల్‌ పంటలు దెబ్బతినడంతో నగరానికి వచ్చే పండ్లు భారీగా తగ్గిపోయాయి. దాదాపు 50 శాతం పంట వర్షాలపాలైనట్లు లెక్కలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘సైకిళ్ల పంపిణీ’కి ఎండదెబ్బ.. అస్వస్థతకు గురైన విద్యార్థినులు

అనకాపల్లిలో చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం విద్యార్థినులు, తల్లిదండ్రులకు పట్టపగలే చుక్కలు చూపించింది. నీడ కోసం కనీసం టెంట్లూ వేయకుండా మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించడంతో విద్యార్థినులు ఎండకు తట్టుకోలేకపోయారు. అరబిందో కంపెనీ సమకూర్చిన సైకిళ్లను శనివారం ఇక్కడి ఎన్టీఆర్‌ క్రీడా మైదానంలో పంపిణీచేశారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తారనడంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు 8 గంటలకే మైదానానికి చేరుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆగస్టు 6వ తేదీ వరకు పలు ప్యాసింజరు రైళ్ల రద్దు

కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్‌ రైళ్లను.. వరదలు, మూడో లైను నిర్మాణ పనుల కారణంగా మరికొన్ని రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వివిధ రైళ్లను ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఆ రైళ్లను ఆగస్టు 6వ తేదీ వరకు రద్దుచేస్తున్నట్లు తెలిపారు. కాజీపేట- డోర్నకల్‌ మధ్య నడిచే డోర్నకల్‌ పుష్‌పుల్‌ రైలు (నం:07753/54), సికింద్రాబాద్‌-వరంగల్‌ మధ్య నడిచే పుష్‌పుల్‌(07462/63), కాజీపేట- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య నడిచే రామగిరి ఎక్స్‌ప్రెస్‌(17003/4)పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ర్యాంకుల పరిమితి.. ‘రుసుములకు అడ్డంకి!’

ర్యాంకు పరిమితి ఆంక్షల కారణంగా రాష్ట్రంలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు  పూర్తిస్థాయి బోధన రుసుం(ట్యూషన్‌ ఫీజు)లకు నోచుకోవడంలేదు. ఇది విద్యార్థుల ఉన్నత చదువులకు అడ్డంకిగా మారింది. పేరుపొందిన మంచి ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు లభించిందని ఆనందపడుతున్నా.. పూర్తి ఫీజులు రాక విద్యార్థుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ర్యాంకులతో సంబంధం లేకుండా కళాశాలకు ఫీజుల నియంత్రణ కమిటీ అనుమతించిన ప్రకారం పూర్తి  ట్యూషన్‌ ఫీజులు చెల్లిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వైకల్యం విస్తుపోయేలా.. ముక్కుతో టైపింగ్‌

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన స్మిత్‌ చాంగెలా చిన్నప్పటి నుంచీ నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. అలాగని శారీరక వైకల్యాన్ని కారణంగా చూపుతూ ఏ పని చేయకుండా ఖాళీగా ఉండిపోలేదు. సవాళ్లను అధిగమించి సత్తా చాటాడు. మొబైల్‌లో చేత్తో టైప్‌ చేస్తుంటే నొప్పులతో మెలికలు తిరిగిపోయేవాడు. దీంతో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ముక్కు కొనతో టైపింగ్‌ అభ్యాసం ప్రారంభించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అదృష్టమంటే ఇదే బాసూ! పాతికేళ్లు పైలాపచ్చీసు

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆదిల్‌ఖాన్‌ జీవనోపాధి కోసం దుబాయికి వెళితే.. అదృష్టలక్ష్మి ఒక్కరోజులో ఆయనను ధనవంతుడిగా మార్చింది. యూఏఈ నిర్వహించిన మెగా ప్రైజ్‌మనీ లక్కీడ్రాలో ఆదిల్‌ఖాన్‌ తొలి విజేతగా నిలిచాడు. దీంతో ఆయన నెలనెలా రూ.5.60 లక్షల (25,000 దిర్హమ్‌లు) చొప్పున 25 ఏళ్లపాటు అందుకోనున్నాడు. ఆదిల్‌ఖాన్‌ దుబాయ్‌లోని ఓ స్థిరాస్తి సంస్థలో ఇంటీరియర్‌ డిజైన్‌ కన్సల్టెంటుగా పనిచేస్తున్నాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వృద్ధురాలిపై అత్యాచారం

ఇంటి వరండాలో నిద్రిస్తున్న వృద్ధ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాధితురాలి చెవి కమ్మలూ ఎత్తుకెళ్లాడు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... 85 ఏళ్ల మహిళ శుక్రవారం రాత్రి తన ఇంటి వరండాలో పడుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారాసలో చేరిక ప్రచారం అవాస్తవం

తాను కాంగ్రెస్‌ పార్టీని వీడి భారాసలో చేరుతున్నానంటూ.. గత కొన్నిరోజులుగా సామాజిక మాధ్యమాలు, మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక పదవిలో ఉన్న ఓ నాయకుడు పార్టీలో తన స్థానాన్ని తగ్గించేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజల్లో నా ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఇలాంటి(పార్టీ మార్పు) దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఒక్క ఓవర్లో 48

ఒక్క ఓవర్లో ఆరు సిక్సర్లే అద్భుతం అనుకుంటే.. నిరుడు ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లతో రుతురాజ్‌ ఔరా అనిపించాడు. నోబ్‌నూ సిక్సర్‌గా మలచడంతో అప్పుడు 43 పరుగులు వచ్చాయి. ఏడు సిక్సర్ల ఘనత మరోసారి నమోదైంది. ఈసారి అఫ్గానిస్థాన్‌ బ్యాటర్‌ సెదిఖుల్లా అటల్‌ ఈ రికార్డు అందుకున్నాడు. ఓవర్లో ఏకంగా 48 పరుగులు రావడం విశేషం. కాబుల్‌ ప్రిమియర్‌ లీగ్‌లో అబాసిన్‌ డిఫెండర్స్‌తో మ్యాచ్‌లో షహీన్‌షా హంటర్స్‌ కెప్టెన్‌ సెదిఖుల్లా (56 బంతుల్లో 118) చెలరేగిపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్యూరిఫైయర్లు వాడుతున్నారా..

పరిశుభ్రమైన మంచినీటిపై అవగాహన పెరిగాక దాదాపు అందరి ఇళ్లలోనూ వాటర్‌ ఫ్యూరిపైర్లు, ఆర్‌ఓ మెషీన్లు ఉంటున్నాయి. వీటిని ఏళ్ల తరబడి వాడేయం కాకుండా, వీటి పనితీరుని గమనించుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. ఫిల్టర్‌ని మార్చాలి... ఆర్‌ఓ మెషిన్‌లో ఉండే సెకండరీ ఫిల్టర్‌ని మూడు నెలలకోసారీ, ప్రైమరీ ఫిల్టర్‌ని ఏడాదికోసారి మార్చుకుంటూ ఉండాలి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని