ఆగస్టు 6వ తేదీ వరకు పలు ప్యాసింజరు రైళ్ల రద్దు

కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్‌ రైళ్లను.. వరదలు, మూడో లైను నిర్మాణ పనుల కారణంగా మరికొన్ని రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

Published : 30 Jul 2023 03:46 IST

కాజీపేట, న్యూస్‌టుడే: కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్‌ రైళ్లను.. వరదలు, మూడో లైను నిర్మాణ పనుల కారణంగా మరికొన్ని రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వివిధ రైళ్లను ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఆ రైళ్లను ఆగస్టు 6వ తేదీ వరకు రద్దుచేస్తున్నట్లు తెలిపారు. కాజీపేట- డోర్నకల్‌ మధ్య నడిచే డోర్నకల్‌ పుష్‌పుల్‌ రైలు (నం:07753/54), సికింద్రాబాద్‌-వరంగల్‌ మధ్య నడిచే పుష్‌పుల్‌(07462/63), కాజీపేట- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య నడిచే రామగిరి ఎక్స్‌ప్రెస్‌(17003/4), కాజీపేట-బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్‌(17035/36), భద్రాచలం రోడ్‌-బల్లార్షా మధ్య నడిచే సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ (నం.17033/34) రైలును వచ్చే నెల 6 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని