Anakapalli: ‘సైకిళ్ల పంపిణీ’కి ఎండదెబ్బ.. అస్వస్థతకు గురైన విద్యార్థినులు

అనకాపల్లిలో చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం విద్యార్థినులు, తల్లిదండ్రులకు పట్టపగలే చుక్కలు చూపించింది. నీడ కోసం కనీసం టెంట్లూ వేయకుండా మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించడంతో విద్యార్థినులు ఎండకు తట్టుకోలేకపోయారు.

Updated : 30 Jul 2023 08:04 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలో చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం విద్యార్థినులు, తల్లిదండ్రులకు పట్టపగలే చుక్కలు చూపించింది. నీడ కోసం కనీసం టెంట్లూ వేయకుండా మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించడంతో విద్యార్థినులు ఎండకు తట్టుకోలేకపోయారు. అరబిందో కంపెనీ సమకూర్చిన సైకిళ్లను శనివారం ఇక్కడి ఎన్టీఆర్‌ క్రీడా మైదానంలో పంపిణీచేశారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తారనడంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు 8 గంటలకే మైదానానికి చేరుకున్నారు. సైకిళ్లు పంపిణీ చేయాల్సిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఉదయం 10.45 గంటలకు వచ్చారు. ఉపన్యాసాల అనంతరం అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని తొమ్మిది, పది తరగతులకు చెందిన 2,500 మంది విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. అప్పటికే మధ్యాహ్నం 12 కావడంతో అంతసేపూ ఎండలో ఉన్న విద్యార్థులు నీరసించిపోయారు. కశింకోట పాఠశాలకు చెందిన విద్యార్థిని కౌసల్య స్పృహ కోల్పోయారు. మరో నలుగురూ అస్వస్థతకు గురవడంతో అంబులెన్సులో చికిత్స అందించారు.

  • సైకిళ్లు పంపిణీచేసిన సందర్భంగా మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. అరబిందో ఫార్మా సేవల్ని కొనియాడారు. అరబిందో ఫార్మా కంపెనీ వైస్‌ఛైర్మన్‌ నిత్యానందరెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు ఈ సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, వైకాపా జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు