Water Purifiers: ప్యూరిఫైయర్లు వాడుతున్నారా..
పరిశుభ్రమైన మంచినీటిపై అవగాహన పెరిగాక దాదాపు అందరి ఇళ్లలోనూ వాటర్ ఫ్యూరిపైర్లు, ఆర్‌ఓ మెషీన్లు ఉంటున్నాయి. వీటిని ఏళ్ల తరబడి వాడేయం కాకుండా, వీటి పనితీరుని గమనించుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..
పరిశుభ్రమైన మంచినీటిపై అవగాహన పెరిగాక దాదాపు అందరి ఇళ్లలోనూ వాటర్ ఫ్యూరిపైర్లు(Buy Water Purifiers), ఆర్‌ఓ మెషీన్లు ఉంటున్నాయి. వీటిని ఏళ్ల తరబడి వాడేయం కాకుండా, వీటి పనితీరుని గమనించుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..
ఫిల్టర్‌ని మార్చాలి... ఆర్‌ఓ మెషిన్‌లో ఉండే సెకండరీ ఫిల్టర్‌ని మూడు నెలలకోసారీ, ప్రైమరీ ఫిల్టర్‌ని ఏడాదికోసారి మార్చుకుంటూ ఉండాలి.
మోటర్ వేసినపుడు... ట్యాంకు నుంచి నేరుగా నీటిని తీసుకునే వాటికి.. మోటర్ వేసినపుడు ఆర్‌ఓను ఆఫ్ చేసి ఉంచాలి. ట్యాంకు నిండిన తర్వాత ఆన్ చేసుకోవాలి.
ట్యాంకు శుభ్రం చేయాలి... ఆర్‌ఓని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూనే, దానిలో ఉండే వాటర్ ట్యాంకుని కూడా శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల దానిలో మలినాలు చేరే అవకాశం తక్కువుగా ఉంటుంది. తాజా నీటిని తాగవచ్చు.
నిమ్మతో శుభ్రం చేయాలి... ఫ్యూరిఫైర్ ట్యాంకుని ఎప్పటికప్పుడు నిమ్మచెక్కతో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ట్యాంకులో ఉండే సూక్ష్మక్రిములు నశించడమే కాకుండా నీటికి మంచి రుచి వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.