Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Aug 2023 09:52 IST

1. ప్రతిభ మీ సొంతమా? ఈ స్కాలర్‌షిప్‌ మీ కోసమే..!

ఈ రోజుల్లో చదువు ఖరీదైన వస్తువుగా మారింది. దానివల్ల కొంతమంది విద్యార్థులు ప్రతిభ ఉన్నా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలే ఉంటున్నారు. ఇలాంటి వారికి సామాజిక బాధ్యత (CSR) కింద కొన్ని సంస్థలు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘లెగ్రాండ్‌’ సంస్థ ప్రతిభ కలిగిన అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నోరు మంచిదైతేనే..

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ఆరోగ్యం కూడా మంచిదవుతుంది! నోటి ఆరోగ్యానికీ గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యలకూ సంబంధం ఉంటోంది మరి. అంటే నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవటం ఇలాంటి జబ్బుల నివారణకూ తోడ్పడుతుందన్నమాట. వయసు మీద పడ్డవారికిది మరింత ముఖ్యం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బ్యాంక్‌ నోట్‌ప్రెస్‌లో ఉద్యోగాలు

సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన తొమ్మిది యూనిట్లలో కేంద్రప్రభుత్వ రంగ సంస్థ.. ‘బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌’ (బీఎన్‌ఎస్‌) ఒకటి.  దేవాస్‌ (ఎంపీ)లోని ఇది తాజాగా సూపర్‌వైజర్‌, జూనియర్‌ టెక్నీషియన్‌ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. పోస్టులను బట్టి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ విద్యార్హతతో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్ష ద్వారా జరుగుతుంది. సూపర్‌వైజర్‌, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ పరీక్షలు వేర్వేరుగా నిర్వహిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సరయుకు సరిలేరు!

వరంగల్‌ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన వేల్పుల సరయు చదరంగంలో అంతర్జాతీయ వేదికలపై విజయాలను సొంతం చేసుకుంటున్నారు. జులై 24 నుంచి 30 వరకు స్పెయిన్‌ దేశంలోని పొంటేవేద్ర నగరంలో నిర్వహించిన గ్రాండ్‌మాస్టర్‌ ఓపెన్‌ టోర్నీలో ఎలాంటి అంచనలు లేకుండా బరిలోకి దిగిన సరయూ ప్రత్యర్థులను చిత్తుచేస్తూ.. ఒకేసారి మూడు నామ్స్‌ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆంధ్ర వర్సిటీ ప్రతిష్ఠపై మసక!

ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) వందేళ్ల సంబరాలకు చేరువవుతోంది. ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వర్సిటీకి గుర్తింపు ఉంది. ఆ ప్రతిష్ఠ ఇప్పుడు మంటగలిసేలా ఘటనలు, ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే వీసీ ఛాంబర్‌ వైకాపా కార్యాలయంలా మారిందన్న ఆరోపణలు ఉండగా, తాజాగా ఆచార్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విద్యార్థుల సన్నద్ధతను వీడియో కాల్‌లో తనిఖీ చేస్తా

‘ఫార్మెటివ్‌-1 పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేశారో  లేదో ఆన్‌లైన్‌లోనే తనిఖీ చేస్తాను.. విద్యార్థులు ఆంగ్లంలోనే పరీక్షలు రాయాలి’ అంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఇచ్చిన ఆదేశాలు ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం  ఫార్మెటివ్‌-1 పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి విద్యార్థుల సన్నద్ధత, వర్క్‌బుక్‌లను మంగళవారం ఆన్‌లైన్‌లో తనిఖీ చేస్తానని ప్రవీణ్‌ ప్రకాష్‌ సామాజిక మాధ్యమాల ద్వారా ఆదేశాలిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నేరం చేసి జైలుకి.. అక్కడే ఉద్యోగ విరమణ

కోపరేటివ్‌ సొసైటీలో కార్యదర్శిగా ఉంటూ ఉద్యోగులు దాచుకున్న డబ్బులను కాజేసిన కేసులో అరెస్టయి జైల్లోనే పదవీ విరమణ చేశారు. విజయవాడలోని సెంట్రల్‌ ఎక్సైజ్‌ స్టాఫ్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌లో జె.ఎస్‌.చక్రవర్తి కార్యదర్శిగా ఉండేవారు. రూ.6.34 కోట్ల నిధులను గోల్‌మాల్‌ చేశారని మూడేళ్ల కిందట విజయవాడలో కేసు నమోదైంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మిగిలింది మూడు వేలే

ఎంసెట్‌ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యేసరికి సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత 18 రకాల కోర్సుల్లో 94.40 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్‌ కోటా సీట్లు 56,059 ఉండగా.. అందులో 52,922 నిండాయి. 3,137 మాత్రమే మిగిలాయి. ఈ 18 కోర్సులకుగాను ఏడింటిలో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కాకపోతే వాటిలో సీట్ల సంఖ్య 325లోపు ఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విద్యార్థిని నీటి సీసాలో మూత్రం పోసిన విద్యార్థులు

రాజస్థాన్‌లో ఓ అనాగరిక ఘటన చోటుచేసుకుంది. తోటి విద్యార్థిని తాగు నీటి సీసాలో కొందరు విద్యార్థులు మూత్రం పోశారు. ఓ ప్రేమ లేఖ రాసి ఆమె పుస్తకాల సంచిలో పెట్టారు. భిల్వాడా జిల్లా లుహారియాలో ఈ అమానుషం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. లుహారియా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక చదువుతోంది. అదే పాఠశాలకు చెందిన కొందరు బాలురు గత శుక్రవారం ఆమె మంచి నీటి సీసాలో మూత్రం కలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. HCA: హెచ్‌సీఏ పెద్దలకు షాక్‌.. 57 క్లబ్‌లపై వేటు

జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ఏక సభ్య కమిటీ హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో ప్రక్షాళన చేపట్టింది. బహుళ క్లబ్‌లతో హెచ్‌సీఏను శాసిస్తున్న క్రికెట్‌ పెద్దలకు షాకిచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న 57 క్లబ్‌లపై జస్టిస్‌ నాగేశ్వరరావు వేటు వేశారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో ఒక దఫా లేదా మూడేళ్ల పాటు పోటీ చేయకుండా ఆయా క్లబ్‌లు, వాటి ఎగ్జిక్యూటివ్‌ కమిటీలపై నిషేధం విధించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని