విద్యార్థిని నీటి సీసాలో మూత్రం పోసిన విద్యార్థులు

రాజస్థాన్‌లో ఓ అనాగరిక ఘటన చోటుచేసుకుంది. తోటి విద్యార్థిని తాగు నీటి సీసాలో కొందరు విద్యార్థులు మూత్రం పోశారు.

Published : 01 Aug 2023 04:26 IST

రాజస్థాన్‌లోని ఓ పాఠశాలలో అకృత్యం

జైపుర్‌: రాజస్థాన్‌లో ఓ అనాగరిక ఘటన చోటుచేసుకుంది. తోటి విద్యార్థిని తాగు నీటి సీసాలో కొందరు విద్యార్థులు మూత్రం పోశారు. ఓ ప్రేమ లేఖ రాసి ఆమె పుస్తకాల సంచిలో పెట్టారు. భిల్వాడా జిల్లా లుహారియాలో ఈ అమానుషం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. లుహారియా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక చదువుతోంది. అదే పాఠశాలకు చెందిన కొందరు బాలురు గత శుక్రవారం ఆమె మంచి నీటి సీసాలో మూత్రం కలిపారు. అంతేకాదు ‘లవ్‌ యూ’ అని రాసిన ఓ పేపర్‌ను కూడా ఆమె సంచిలో పెట్టి వెళ్లారు. ఇవేమీ తెలియని బాలిక ఆ సీసాలోని నీటిని తాగింది. దుర్వాసన వస్తుండటం గ్రహించి పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. తన పుస్తకాల సంచిలో ఓ ప్రేమలేఖ కూడా ఉన్నట్లు వారికి తెలిపింది. ఈ విషయం తన దృష్టికి వచ్చినా.. ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకోలేదు. బాలిక ఇంటి వద్ద ఈ విషయం తెలియడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు సోమవారం పాఠశాలకు వెళ్లి ఆందోళన చేపట్టారు. తహసీల్దార్‌, పోలీసులు, ప్రిన్సిపల్‌ దృష్టికి ఈ దురాగతాన్ని తీసుకెళ్లారు. అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో నిందితుల ఇళ్లపై రాళ్ల దాడి చేశారు. ‘‘విద్యార్థిని పోలీసులకు అధికారికంగా ఇంకా ఫిర్యాదు చేయలేదు. నిందితుల ప్రాంతంలోకి ప్రవేశించి రాళ్ల దాడి చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు’’ అని ఏఎస్పీ ఘనశ్యామ్‌ శర్మ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు