ప్రతిభ మీ సొంతమా? ఈ స్కాలర్‌షిప్ మీ కోసమే..!
సామాజిక బాధ్యత (CSR) కింద కొన్ని సంస్థలు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘లెగ్రాండ్’ సంస్థ ప్రతిభ కలిగిన అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ రోజుల్లో చదువు ఖరీదైన వస్తువుగా మారింది. దానివల్ల కొంతమంది విద్యార్థులు ప్రతిభ ఉన్నా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలే ఉంటున్నారు. ఇలాంటి వారికి సామాజిక బాధ్యత (CSR) కింద కొన్ని సంస్థలు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘లెగ్రాండ్’ సంస్థ ప్రతిభ కలిగిన అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విద్యుత్ పరికరాల తయారీ సంస్థగా లెగ్రాండ్ సంస్థ కొన్ని లక్షల ఇళ్లలో వెలుగులు నింపింది. అలాగే చదువుకునే అమ్మాయిలను భవిష్యత్తు లీడర్లుగా మార్చడం కోసం వారికి ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిభ కలిగిన అమ్మాయిలకు ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రతి ఏడాది స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. గతేడాది నుంచి ప్రత్యేక అవసరాలున్న అమ్మాయిలు, ట్రాన్స్‌జెండర్లను కూడా ఇందులో చేర్చింది. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి 60 వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థినులకు లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.
ప్రత్యేక అవసరాలున్న అమ్మాయిలు, ట్రాన్స్‌జెండర్లు, సింగిల్ పేరెంట్ ఉన్న కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థినులను స్పెషల్ కేటగిరీగా పరిగణిస్తారు.
అర్హతలు:
⚛ ఈ స్కాలర్‌షిప్ మన దేశంలోని అమ్మాయిలకు మాత్రమే.
⚛ అభ్యర్థులు మన దేశంలోని ఏదైనా కాలేజీలో బీటెక్, బీఈ, బీఆర్క్, బీబీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్ పొందుండాలి.
⚛ అభ్యర్థులు 2022-23 విద్యా సంవత్సరంలో 12వ తరగతి పాసై ఉండాలి.
⚛ అభ్యర్థులు 10, 12వ తరగతుల్లో 70 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ప్రత్యేక అవసరాలున్న అమ్మాయిలు, ట్రాన్స్‌జెండర్లకు కొన్ని మినహాయింపులు ఉంటాయి.
⚛ అన్ని వనరులు కలిపి వారి కుటుంబ ఆదాయం సంవత్సరానికి ఐదు లక్షల కంటే తక్కువ ఉండాలి.
ప్రయోజనాలు:
⚛ ఎంపికైన విద్యార్థులకు ‘లెగ్రాండ్ ఇండియా’ మెంటరింగ్ సహాయం అందిస్తుంది. ఈ క్రమంలో వారిని భవిష్యత్తు లీడర్లుగా తీర్చిదిద్దడం కోసం నిపుణులు సహాయం అందిస్తారు.
⚛ ఎంపికైన విద్యార్థులకు ప్రత్యేకంగా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్ అసిస్టెన్స్ కూడా అందిస్తారు.
⚛ విద్యార్థుల ప్రతిభను బట్టి కోర్సు పూర్తయ్యేవరకు స్కాలర్‌షిప్ అందిస్తారు.
మరిన్ని వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి..
https://www.buddy4study.com/page/legrand-empowering-scholarship-program
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.