Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Aug 2023 09:14 IST

1. ఏపీలో కొత్త పింఛన్లు కొందరికేనా?

పారదర్శకతపై గంభీరమైన మాటలు చెప్పే ముఖ్యమంత్రి జగన్‌... పాలనలో అడుగడుగునా గోప్యత పాటిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వుల్ని పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచకుండా ప్రత్యేక వ్యవస్థను తెచ్చిన ఆయన... సామాజిక భద్రత పింఛన్లపై అదే గోప్యత అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఆరు నెలలకోసారి (జులై, జనవరి) కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పిన గడువు దాటి మరో రెండు నెలలు గడుస్తోంది. జులై 1వ తేదీనే కొత్త పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘ఉపాధి’లోనూ ఊదేస్తున్నారు!

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పనుల్లో జరిగే అక్రమాలు గుర్తించడంలో సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌) బృందాలది కీలకపాత్ర. లేని కూలీల పేరుతో వేతనాలు కాజేసినా.. తప్పుడు హాజరుతో అక్రమాలకు పాల్పడినా.. తక్కువ విస్తీర్ణంలో చేసిన పనిని ఎక్కువగా చూపి నిధులు నొక్కేసినా ఈ సామాజిక తనిఖీ బృందాలు గుర్తించి తగిన చర్యలకు సిఫారసు చేస్తాయి. కానీ కంచే చేను మేసినట్లుగా తనిఖీ బృందాల్లోని కొందరు అవకతవకలకు పాల్పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌!

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారాను మోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. ఎన్నికలకు ముహూర్తాన్ని ఖరారు చేసేందుకు విస్తృత కసరత్తు చేపట్టింది. అక్టోబరు రెండో వారంలోగా షెడ్యూల్‌ను ప్రకటించాలని యోచిస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై అధ్యయనం చేసేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం రాష్ట్రానికి రానుంది. అక్టోబరు మొదటి వారంలో వచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఈ ట్రాక్టరు.. తీరే వేరు

సాగులో వ్యయాన్ని తగ్గించడానికి పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన మూల శశిరథ్‌రెడ్డి(25) విద్యుత్‌ ట్రాక్టరు తయారు చేశారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన శశిరథ్‌.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్ట్రికల్‌ ట్రాక్టర్‌ తయారీని ప్రారంభించి, మే నెలలో పూర్తి చేశారు. దీని తయారీకి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ఖర్చు అయిందని తెలిపారు. ట్రాక్టరులో 32 చిన్న లిథియం ఫాస్ఫేట్‌ బ్యాటరీలు, స్మార్ట్‌ కంట్రోలర్‌, 26 హెచ్‌పీ మోటారు బిగించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మరణ వాంగ్మూలాన్ని నిజమని నమ్మలేం

మరణ వాంగ్మూలం ఆధారంగానే నేరారోపణలు నిజమని నిర్ధారించడం సరికాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉరిశిక్ష పడిన నిందితుడిని తక్షణం విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తన కుమారుడు, ఇద్దరు సోదరులు నిద్రిస్తున్న గదికి నిప్పంటించి వారిని హత్య చేశాడన్న ఆరోపణలను నిర్ధారిస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన నిందితుడు ఇర్ఫాన్‌కు 2017లో ట్రయల్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సమయం విలువ తెలుసుకో.. కాలంతో సాగిపో

6. వేగంగా విస్తరిస్తున్న కీళ్లవాతం!

ప్రస్తుతం 30 ఏళ్లు, అంతకు పైబడినవారిలో 15 శాతం మంది ఆస్టియో ఆర్థరైటిస్‌ (కీళ్లనొప్పులు)తో బాధపడుతున్నారని, 2025 నాటికి ప్రపంచ జనాభాలో 100 కోట్లమంది ఈ వ్యాధి బారినపడతారని అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ సంస్థ పరిశోధకులు హెచ్చరించారు. 1990-2020 మధ్య 30 ఏళ్ల కాలంలో 200 దేశాల్లో కీళ్లవాత బాధితుల సమాచారాన్ని విశ్లేషించి వీరు వెలువరించిన అధ్యయనం లాన్సెట్‌ పత్రికలో ప్రచురితమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రశీదు అడగండి.. అప్‌లోడ్‌ చేయండి.. రూ.కోటి బహుమతి పొందండి

వినియోగదార్లు తాము జరిపే కొనుగోళ్లన్నింటికీ విక్రయదార్ల నుంచి రశీదును అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ‘మేరా బిల్‌ మేరా అధికార్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు   ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి త్రైమాసికంలో లక్కీడ్రా నిర్వహించి, రూ.1 కోటి చొప్పున రెండు బంపర్‌ బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపింది. సెప్టెంబరు 1 నుంచి 12 నెలల కాలానికి ప్రయోగాత్మక పద్ధతిలో (పైలట్‌ ప్రాజెక్ట్‌) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తెలుగమ్మాయి.. ఓ సాహసం

హిమాలయాలు.. ఈ పేరు వినగానే మంచు పర్వతాలు, ప్రకృతి సోయగాలు, అందమైన సరస్సులు స్పురిస్తాయి. ఎంచక్కా మంచు కొండల్లో తిరుగుతూ ప్రకృతి అందాల్ని ఆస్వాదించాలన్న ఆలోచన వస్తుంది. కాని ఆ అమ్మాయి మాత్రం హిమాలయాల్ని తన ఆశయ సాధనకు మార్గంగా ఎంచుకుంది. ఎముకలు కొరికే చలిలో ‘ద గ్రేట్‌ హిమాలయన్‌ అల్ట్రా రేసు’ను దిగ్విజయంగా పూర్తిచేసి యువతకు స్ఫూర్తిగా నిలవాలని భావిస్తోంది తెలుగమ్మాయి మారపరెడ్డి నిహారిక రెడ్డి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వరలక్ష్మీ కటాక్షం

భారతీయ పర్వకాలాల్లో ఒక్కొక్క రుతువుకు, ఒక్కో మాసానికి, తిథులకు ప్రత్యేకతలున్నాయి. ఆ ప్రత్యేకతలే ప్రత్యేక దేవతారూపాలుగా పూజలందు కుంటున్నాయి. పూజ, వ్రతం, ధ్యానం, సంకీర్తన... వంటి మార్గాలన్నీ మనసును మహాశక్తితో అనుసంధానపరచే సాధనలు. గ్రీష్మంలో అగ్నితత్వాన్ని స్వీకరించిన భూదేవి, వర్షరుతువు ఆరంభమాసమైన శ్రావణంనుంచి జలతత్వాన్ని గ్రహిస్తుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఓ కంట కనిపెడుతుండాలి!

నాలుగు రోజుల కిందట అయిజ పట్టణంలోని నాలుగోవార్డు పరిధిలో ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన ఏడేళ్ల చిన్నారిపై వరాహం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తల్లిదండ్రులు పొలానికి వెళ్లడంతో బాలుడు ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ప్లేటును శుభ్రం చేసుకోడానికి ఇంటి బయటికి వచ్చినప్పుడు ఘటన చోటుచేసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని