ఈ ట్రాక్టరు.. తీరే వేరు

సాగులో వ్యయాన్ని తగ్గించడానికి పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన మూల శశిరథ్‌రెడ్డి(25) విద్యుత్‌ ట్రాక్టరు తయారు చేశారు.

Published : 25 Aug 2023 04:51 IST

న్యూస్‌టుడే, మంథని గ్రామీణం: సాగులో వ్యయాన్ని తగ్గించడానికి పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన మూల శశిరథ్‌రెడ్డి(25) విద్యుత్‌ ట్రాక్టరు తయారు చేశారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన శశిరథ్‌.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్ట్రికల్‌ ట్రాక్టర్‌ తయారీని ప్రారంభించి, మే నెలలో పూర్తి చేశారు. దీని తయారీకి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ఖర్చు అయిందని తెలిపారు. ట్రాక్టరులో 32 చిన్న లిథియం ఫాస్ఫేట్‌ బ్యాటరీలు, స్మార్ట్‌ కంట్రోలర్‌, 26 హెచ్‌పీ మోటారు బిగించారు. ఒకసారి బ్యాటరీలను బిగించాక.. 10-12 ఏళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదని ఆయన తెలిపారు. పూర్తిగా ఛార్జ్‌ అయిన తర్వాత 4 గంటలపాటు ట్రాక్టర్‌ నడుస్తుందన్నారు. సాధారణ ట్రాక్టరు 4 గంటలపాటు పనిచేయాలంటే 20 లీటర్ల డీజిల్‌ పోయాలని.. ఎలక్ట్రికల్‌ ట్రాక్టర్‌ను రూ.250 ఖర్చుతోనే అంతసేపు నడపవచ్చని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు జిల్లా కలెక్టర్‌ నుంచి శశిరథ్‌రెడ్డి ప్రశంసాపత్రం, షీల్డు అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని